గిరీష్ కర్నాడ్ నిన్ను చంపేస్తా: నటుడు, దర్శకుడు
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను చంపేస్తానని, కన్నడ నటుడు, దర్శకుడు హుచ్చా వెంకట్ (పిచ్చి వెంకట్) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తానుబయటకు వచ్చానని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించనని హెచ్చరించాడు.
కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న హుచ్చా వెంకట్ అదే షోలో పాల్గొన్న గాయకుడు రవి మరూర్ గూబ పగలగొట్టి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే హుచ్చా వెంకట్ గిరీష్ కర్నాడ్ ను చంపేస్తానని హెచ్చరించాడు.
నువ్వు ఏమనుకుంటున్నావ్ హిందువుల విరోధి అయిన టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుతావా, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని సూచిస్తావా అంటూ హుచ్చా వెంకట్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇప్పుడు తాను బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చానని, నీ అంతు చూస్తానని గిరీష్ కర్నాడ్ ను హెచ్చరించాడు. టిప్పు సుల్తాన్ చరిత్ర గురించి తెలుసుకుని తరువాత మాట్లాడాలని గిరీష్ కర్నాడ్ కు సూచించాడు.
వెయ్యి మంది వెళ్లి గిరీష్ కర్నాడ్ ను చంపేస్తే అందరిని జైలులో పెడుతారా అని హుచ్చా వెంకట్ మీడియాను ప్రశ్నించారు. అయితే గిరీష్ కర్నాడ్ ఇప్పటి వరకు ఈ విషయంపై ఫిర్యాదు చెయ్యలేదని పోలీసు అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications