ఢిల్లీలో రెండున్నరేళ్ల ఆఫ్గన్ చిన్నారిపై అత్యాచారం?

ఆఫ్గనిస్థాన్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం అంబేద్కర్ నగర్‌లో ఉంటోంది. గురువారం సాయంత్రం తమ కూతురు నిద్రపోయాక వారు పని మీద బయటకు వెళ్లారు. అరగంటలో తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే పాపకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. పాప ఏడుస్తూ కనిపించింది.
చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము పని మీద వెళ్ల వచ్చేసరికి పాపకు రక్తస్రావం అవుతోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం సర్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాలిక పైన అత్యాచారం జరిగిందా లేక అనుకోకుండా గాయాలయ్యాయా అనే విషయం వైద్యుల నివేదిక వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications