ఘోరం: రేప్ అడ్డుకుందని గొడ్డలితో నరికి చంపాడు
ధోలపూర్: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని ధైర్యంగా ప్రతిఘటించింది ఓ బాలిక. దీంతో ఆగ్రహానికి గురైన ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బసేది ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన విష్ణు ఠాకూర్(35) అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
బాలిక అతడిని అడ్డుకుని, చుట్టుపక్కల వారికి వినిపించేలా కేకలు వేసింది. దీంతో సదరు వ్యక్తి పక్కనే ఉన్న గొడ్డలితో బాలికపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. కాళ్లు చేతులు కట్టేసి చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications