పదిమంది ముందు కిస్ ఇవ్వబోతే, నాలుక కొరికింది

మోరేనా జిల్లాకు చెందిన సదరు నిందితుడు, యువతి కమలానగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఆ యువతి తనకు నాలుగేళ్లుగా తెలుసునని, ఆమె తనకు కొంత సొమ్ము బాకీ ఉందని అతను ఆరోపిస్తున్నాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కమలేష్‌ను అరెస్టు చేశారు. పోలీసులు కమలేషన్ పైన సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.
సదరు యువతితో తనకు నాలుగేళ్లుగా సంబంధం ఉందని కమలేష్ చెబుతుండగా ఆమె దానిని కొట్టి పారేస్తోంది. అసలు అతను తనకు తెలియనే తెలియదని, పది రోజులుగా వేధిస్తున్నాడని చెప్పింది.
తాను బ్యూటీపార్లర్‌లో పని చేస్తానని, అక్కడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతోంది. తనను వేధించినందుకు నాలుక కొరికి మంచి పని చేశానని, అందరు యువతులు అదే రకంగా వ్యవహరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications