ఫ్రెండ్‌కి ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు: యువతి అరెస్ట్
బరేలి: తన స్నేహితురాలికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ద్వారా అసభ్య సందేశాలు పంపిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆ యువతి మరో యువతికి అసభ్య సందేశాలను పంపించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిగిన బరేలి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కూతరుకు గత కొన్ని రోజులుగా తరచూ అసభ్య సందేశాలు రావడంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న సైబర్ విభాగం పోలీసులు, దర్యాప్తు జరిపి బాధితురాలికి తెలిసిన, బంధువైన యువతే ఈ సందేశాలు పంపుతున్నట్లు తేల్చారు.
నిందితురాలిపై ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పి క్రైం ఎస్‌పి సింగ్ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి తెలిసిన వ్యక్తులే నిందితులని దర్యాప్తు జరిపామని, అదే నిజమైందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications