డ్యాన్స్ స్కూల్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య: డ్యాన్స్ మాస్టర్ వేధించాడని దుమ్ములేపేశారు !

డ్యాన్స్ స్కూల్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యడ్యాన్స్ మాస్టర్ వేధింపులే కారణం అంటున్న కుటుంబ సభ్యులుబెంగళూరులో డ్యాన్స్ మాస్టర్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు

బెంగళూరు: బెంగళూరు నగరంలో డ్యాన్స్ స్కూల్ లో బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. బెంగళూరు నగరంలోని యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టూరు లేఔట్ లో చందనా (17) అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

చందనా ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్టూరు లేఔట్ లో సతీష్ అనే యువకుడు డ్యాన్స్ మాస్టర్ నివాసం ఉంటున్నాడు. సతీష్ దగ్గరకు పలువురు డ్యాన్స్ నేర్పుకోవడానికి వెలుతున్నారు. సతీష్ దగ్గర చందనా కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి వెలుతున్నది. ఎప్పటిలాగే సోమవారం డ్యాన్స్ స్కూల్ కు వెళ్లింది.

Girl committed suicide in a dance class suhool in Bengaluru in Karnataka.

డ్యాన్స్ క్లాస్ పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్లిన చందనా మళ్లీ సోమవారం రాత్రి డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వెళ్లింది. తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుందని సతీష్ చందనా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. డ్యాన్స్ మాస్టర్ సతీష్ వేధింపులకు గురి చెయ్యడం వలనే చందనా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

చందనా కుటుంబ సభ్యులు డ్యాన్స్ మాస్టర్ సతీష్ ను పట్టుకుని చితకబాదేశారు. అతని వేధింపుల కారణంగానే చందనా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి చందనా ఎందుకు డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వెళ్లింది అంటూ యలహంక న్యూటౌప్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+