Viral Video:వావ్.. అమ్మాయి సూపర్ స్టెప్పులు, వెనకాలే అంకుల్ డ్యాన్స్..వైరల్
ఏం జరిగిన సెన్సేషన్.. అవును కొందరు చక్కగా స్టెప్పులు వేస్తున్నారు. కానీ వెనకాల కూడా ఒకాయన జోరుగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అదీ వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కూరగాయాల మార్కెట్ వద్ద ఆ అమ్మాయి హుషారుగా డ్యాన్స్ చేసింది.
రోడ్డు మీద అమ్మాయి డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకోవడానికి వీడియో తీసుకుంటోంది. 'దిల్ బర్.. దిల్ బర్' అంటూ పాట ప్లే అవుతుంటే.. ఆమె డ్యాన్స్ చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి ఖాకీ రంగు డ్రెస్‌లో ఉన్న పెద్దాయన వచ్చాడు. ఆమె డ్యాన్స్ చేస్తున్న కొద్దీ.. తానూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఎలా చేస్తోందో చూస్తూ.. తానూ అనుకరించడం మొదలుపెట్టాడు.

చిల్డ్ యోగి గల ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 2.62 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి. ఇవాళ, రేపు రోడ్ల మీద కూడా మంచి తోడు దొరుకుతోందని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.అమ్మాయి డ్యాన్స్ చాలా బాగుందని పలువురు నెటిజన్లు సింపుల్ గా కామెంట్ చేశారు.
अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs
— 24 (@Chilled_Yogi) October 6, 2022
వెనకాల పెద్దాయన ఈజ్‌తో చేసిన డ్యాన్స్ ఇంకా బాగుంది. ఐయామ్ ఇంప్రెస్డ్ అని మరికొందరు పేర్కొంటున్నారు. డ్యాన్స్‌తో పాటు వెనకాల వ్యక్తి చేసిన డ్యాన్స్ కూడా అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. డ్యాన్స్ చూస్తూ తాను అలా చేయడానికి పెద్దాయన చేసిన ప్రయత్నం మామూలుగా లేదని మరికొందరు మెచ్చుకుంటున్నారు. నడిరోడ్డులో మార్కెట్ల వద్ద అమ్మాయిలు అలా డ్యాన్స్ చేయడం ఏమిటి? ఇదేం కొత్త ట్రెండ్' అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications