పెళ్లికి సిద్ధంగా లేనని మహిళా టెక్కీ వెబ్‌సైట్, లక్షల మంది వ్యూయర్స్
బెంగళూరు: తాను అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని ఓ యువతి వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఆ వెబ్‌సైటును ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. తమిళనాడుకు చెందిన ఇందూజా పిళ్లై కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
తన వయస్సు 23 అని, ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని, ప్రస్తుతం ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకుంటున్నానని, తన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఇంకా సమయం కావాలని, భారత్‌లో అమ్మాయిలకు ముప్పై ఏళ్లు దాటితో పెళ్లవదనే మాటలు ఎవరు కల్పిస్తారోనని ఆమె తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.

తన బ్లాక్‌ను చాలామంది చూస్తారని భావించడం లేదని, అంతేకాకుండా, తన పైన విమర్శలు వస్తాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, అందుకు విరుద్ధంగా తనకు మంచి ప్రతిస్పందన వచ్చిందన్నారు.
ఉత్తరాది నుండి చాలా స్పందన వస్తుండగా దక్షిణాది నుండి తక్కువగా వస్తోందని చెప్పారు. వెబ్ సైట్ గురించి తొలుత తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత తనను అర్థం చేసుకున్నారని చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications