• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంపేశారా...చనిపోయిందా: కోల్‌కతా స్కూలులో విద్యార్థిని అనుమానాస్పద మృతి

|

కోల్‌కతా: కోల్‌కతాలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జీడీ బిర్లా స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని అచేతన స్థితిలో పడిఉండటం చూస్తే ఎవరో ఆమెను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మణికట్టుకోసి, ప్లాస్టిక్ బ్యాగుతో తన ముఖానికి చుట్టి అచేతన స్థితిలో బాత్రూంలో పడి ఉండటం చూస్తే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. తను మానసిక వేదనకు లోనవుతున్నట్లు లేఖలో ఉంది. అదే సమయంలో మూడు నెలల నుంచి సరిగ్గా నిద్రపట్టడం లేదని లేఖలో రాసిఉంది.

విద్యార్థిని మృతి వెలుగుచూడగానే కోల్‌కతా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మురళీధర్ శర్మ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులను విచారణ చేశారు. విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్కూలును వదిలి వాష్‌రూంలోకి వెళ్లినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. గంట సమయం దాటినప్పటికీ క్లాస్‌రూంకు రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచరు విద్యార్థిని కోసం వెతకటం ప్రారంభించారు. అనుమానం వచ్చి బాత్‌రూంలో వెతుకగా ఆమె రక్తమోడుతూ అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి బ్లేడు, సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

girls suicide

ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని శాంపిల్స్ ను సేకరించారు. ఓ ప్లాస్టిక్ డబ్బాలో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించగా... ఒకటి మాత్రం బయట పడి ఉండటం గమనించారు.అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్‌టిట్యూట్‌లో ప్రవేశ పరీక్ష కోసం అమ్మాయి చదువుకుంటోందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అమ్మాయి బాగా చదువుతుందని టీచర్లు తెలిపారు. ఘటనపై లోతైన విచారణకు డిమాండ్ చేసింది పేరెంట్స్ ఫోరం. 45 నిమిషాలుగా క్లాసుకు రాకుండా ఉంటే టీచర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సెక్యూరిటీ ఏమైందని అడిగారు.

బాధితురాలు తండ్రి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థిని మాత్రం తన తల్లితో కోల్‌కతాలో ఉంటోంది. 2017లో ఇదే స్కూలు యాజమాన్యంపై పెద్ద ఎత్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. ఆసమయంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పేరెంట్స్ అంతా నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a class 10 student of GD Birla School in Kolkata was found dead with her wrist slit and a plastic bag wrapped around her head inside a bathroom on the school premises on Friday afternoon. The body has been sent for postmortem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more