ఫేస్ బుక్ ఫ్రెండ్స్: సినిమా థియేటర్లో అమ్మాయిపై గ్యాంగ్ రేప్, చేతులు కట్టి, నోట్లో !

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో నేరాలు మాత్రం తగ్గడం లేదు. క్రైం సినిమాలను తల తన్నె రీతిలో ఓ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లి సినిమా థియేటర్ లోనే గ్యాంగ్ రేప్ చేశారు.

16 ఏళ్ల అమ్మాయితో ఇద్దరు యువకులు రెండు నెలలు ముందు సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు. ప్రతి రోజు ఆ అమ్మాయితో ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో చాటింగ్ చేశారు. అమ్మాయికి అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఆమెను కలిసేవారు.

 Girl gangraped inside movie theater in Uttar Pradesh

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆ అమ్మాయిని ఇద్దరు కామాంధులు మవానా ప్రాంతంలో కలిశారు. మవానా పట్టణంలో ముగ్గురు కలిసి షాపింగ్ చేశారు. తరువాత సినిమాకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రేక్షకులు తక్కువగా ఉన్న సినిమా థియేటర్ కు యువతిని తీసుకెళ్లారు.

ప్రేక్షకులు ఎవ్వరూ లేని ప్రాంతంలో ముగ్గురూ కుర్చున్నారు. తరువాత కామాంధులు అసలు స్వరూపం చూపించారు. యువతి కేకలు వెయ్యకుండా ఆమె నోటీలో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి సినిమా థియేటర్ లోనే యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారు.

విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధులను అరెస్టు చేసి వారి బైక్ స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించామని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a 16-year-old girl has allegedly been gangraped inside a movie theatre in Meerut district in Uttar Pradesh. The police have arrested two people in connection with the case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X