రామ్‌దేవ్ పతంజలి హాస్టల్‌నుండి ఢిల్లీ యువతి అదృశ్యం

 girl goes missing from Ramdev's Patanjali University hostel
న్యూఢిల్లీ: యోగా గురువు రామ్‌దేవ్ బాబుకు చెందిన పతంజలి విశ్వవిద్యాలయంలోని వసతి గృహం నుంచి ఢిల్లీకి చెందిన పద్దెనిమిదేళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు శనివారం వెల్లడించారు. పతంజలి విశ్వవిద్యాలయంలో యోగ శాస్త్ర గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్న ఈ యువతి గురువారం నుంచి కనిపించడం లేదని బహదరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆర్‌కె సక్లానీ టెలిఫోన్ ద్వారా పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు.

యువతి తల్లిదండ్రులతో పాటు సదరు హాస్టల్ అధికారులు విడివిడిగా ఫిర్యాదులు దాఖలు చేయడంతో శుక్రవారమే ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ యువతి కోసం బల్జీత్ అనే ఒక వ్యక్తి తరచూ హాస్టల్‌కు వస్తుండేవాడని, అతడిని పెళ్లి చేసుకోనున్నట్టు ఆమె చెబుతూ ఉండేదని స్నేహితులు ప్రాథమిక విచారణలో వెల్లడించారని చెప్పారు.

ఈ వివరాలను బట్టి చూస్తే ఆమె అతనితో కలసి పారిపోయి ఉంటుందని అనుమానిస్తున్నామని సక్లానీ తెలిపారు. గురువారం కూడా అతను హాస్టల్‌కు వచ్చినట్లు కొందరు చెప్పారన్నారు. కాగా, ఢిల్లీలోని గీతాంజలి పార్కు ప్రాంతంలో నివసించే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+