ప్రియుడ్ని కలిసేందుకు బిల్డింగ్‌పై నుండి దూకి గర్ల్ మృతి

ఆమె ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె అదే హౌసింగ్ కాంప్లెక్సులో పక్కనే ఉన్న మరో ఇంటిలో గల యువకునితో ప్రేమలో పడింది. ఆయనతో కొంతకాలంగా ఆమె సంబంధం నెరపుతోంది. మంగళవారం ఆయనను కలుసుకోవాలనుకుంది.
అయితే, నేరుగా వెళ్తే హౌసింగ్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన సిసిటివు ఫుటేజీల్లో కనిపిస్తానని భావించి, టెర్రాస్ పైకి వెళ్లి అక్కడి నుండి పక్క భవనం పైకి దూకే ప్రయత్నం చేసింది.
మంగళవారం రెండు గంటల సమయంలో ఆమె టెర్రాస్ పైకి వెళ్లింది. అక్కడ డోర్ లాక్ చేసి ఉండటంతో తన ప్రియుడికి సందేశం పంపించింది. ఆ తర్వాత అక్కడి నుండి దూకింది. కానీ, జారిపడటంతో మృతి చెందింది. కానీ, పట్టు తప్పి రెండు భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయి ప్రాణాలు విడిచింది. దీన్ని, ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఆమె ఏడో అంతస్తు నుండి దూకింది.


Click it and Unblock the Notifications