అమ్మాయిని చంపిన సోదరులు, అబ్బాయి సూసైడ్

అమ్మాయి అదే పట్టణానికి చెందిన ముబారిక్ హసన్ అనే 21 ఏళ్ల యువకుడి ప్రేమలో పడింది. వారి మద్య సంబంధాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై సోమవారంనాడు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో అమ్మాయిని గొంతు నులిమి చంపారు.
అత్మహత్యగా చిత్రీకరించేందుకు అమ్మాయి శవాన్ని సీలింగ్ ప్యాన్‌కు ఆమె సోదరులు అహసన్, ఆశు వేలాడదీసినట్లు ఎస్పీ (రూరల్) ఆలోక్ ప్రియదర్శిని మీడియా ప్రతినిధులకు చెప్పారు. కాగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
అమ్మాయిని గొంతు నులిమి చంపినట్లు, అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్లు శవపరీక్షలో తేలిందని ఆయన చెప్పారు. అమ్మాయి సోదరులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications