అమ్మాయిని ఉరితీశారు: అబ్బాయి తల నరికారు
రోహతక్: హర్యానా రాష్ట్రంలో మధ్య యుగాల నాటి ఘాతుకం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అమ్మాయికి ఉరేసి చంపారు, అబ్బాయి తల నరికారు. ప్రేమించుకున్న నేరానికి వారు ఈ నేరానికి ఒడిగట్టారు. తమ పెళ్లిని అంగీకరిస్తారని ఆశపడి గ్రామానికి వచ్చిన కొన్ని గంటలకే ఆ ప్రేమికులను పొట్టన పెట్టుకున్నారు.
ఈ సంఘటనలో పోలీసులు అమ్మాయి తండ్రిని, ఆమె అంకుల్‌ని, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పరువు పోయిందనే ఆగ్రహంతో వారు ఈ చర్యకు దిగారు. ఘర్నవతి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వార్తాకథనం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

నిధి బరాక్ (20), ధర్మేంద్ర బరాక్ (23) తమ పెళ్లిని అంగీకరించకపోవడంతో మంగళవారం ఢిల్లీకి పారిపోయారు. నిధి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని కాగా, ధర్మేందర్ టెక్నికల్ కోర్సు చేస్తున్నాడు. తాము ఏ విధమైన హాని తలపెట్టబోమని నిధి కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. దీంతో వారు తిరిగి వచ్చారు.
నిధి ఇంటిలో ప్రేమజంటను గంటల తరబడి హింసకు గురి చేశారని పోలీసులు అంటున్నారు. అమ్మాయిని ప్రజల సమక్షంలో చంపేశారు. అబ్బాయిని ఘోరంగా కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తల నరికారు. శవాన్ని గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో పడేశారు.
పోలీసులు వచ్చేసరికి అమ్మాయి శవానికి అంత్యక్రియలు చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. సగం కాలిన అమ్మాయి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications