సల్మాన్ సరసన హీరోయిన్ అని చెప్పి.. యువతిపై రేప్ చేశాడు
జైపూర్: బాలీవుడ్‌లో కథానాయికగా ఎదగాలనే కలలు కంటున్న ఓ యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించిన ఓ నగల వ్యాపారి.. ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబైకి చెందిన నగల వ్యాపారి, జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యాచారం చేసిన నిందితుడు... దాన్ని వీడియోతీసి, వాట్సప్‌లో బాధితురాలికి పంపాడు. వాళ్లిద్దరూ కొంతకాలం క్రితం జైపూర్‌లో కలుసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్‌లోని శ్యాంనగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందిత నగల వ్యాపారిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications