రెండు నెలలుగా కూతురిపై తండ్రి రేప్
థానే: కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే పట్టణంలోని భయాందర్ టౌన్ షిప్‌లో నివసించే ఓ వ్యక్తి తన పదేళ్ల కూతురిపై గత సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక అతని చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ విషయం ఎవరికైనా తెలియజేస్తే చంపేస్తానంటూ ఆ వ్యక్తి భార్య, కుమార్తెలను బెదిరించాడని పోలీసులు చెప్పారు.

అయినప్పటికీ అతని భార్య నిన్న స్థానిక పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. బాలికపై నిందితుడు గత రెండు నెలలుగా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications