స్నానం చేస్తుండగా తొంగి చూశాడని.., బాత్రూంలో కలిసున్నారని ట్విస్ట్

జైపూర్: ఓ ఆకతాయి తాను స్నానం చేస్తుండగా చూశాడని, దానిని అవమానంగా భావించిన ఓ 20 ఏళ్ల యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేలాన్ గ్రామానికి చెందిన ఓ యువతి బుధవారం సాయంత్రం స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు బాత్రూంలోకి తొంగి చూశాడు. ఇది గమనించిన యువతు పెద్దగా కేకలు వేసింది.

కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను చితకబాదారు. అతనిని కట్టేశారు. ఆ తర్వాత యువకుడి కుటుంబ సభ్యులు వచ్చి వీరితో గొడవ పడ్డారు. కట్లు ఊడదీసి యువకుడిని తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

Girl sets self on fire after seeing Peeping Tom

ఈ ఘర్షణ నేపథ్యంలో సదరు యువతి ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అదే సమయంలో ఆ యువకుడు అక్కడి నుంచటి పారిపోయాడు.

ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించటారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. యువతి, యువకులు ఇద్దరు ప్రేమికులని, వాళ్ళిద్దరూ బాత్రూంలో కలిసి ఉండటాన్ని యువతి మామయ్య చూశాడని, అమ్మాయి తప్పును కప్పి పుచ్చేందుకు బాత్రూంలో తొంగి చూసినట్లు చెబుతున్నారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+