బాయ్‌ఫ్రెండ్ డబ్బడిగితే: తండ్రినే టార్గెట్ చేసిన గర్ల్ ఫ్రెండ్.. భలే బోల్తా కొట్టించారు?

అయితే ప్రియురాలు మాత్రం.. తన తండ్రి కారును దొంగిలించి దాన్ని అమ్మేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సహకరించింది కూడా.

చెన్నై: ఫేస్‌బుక్ పరిచయం ద్వారా ఓ యువకుడితోప్రేమలో పడ్డ యువతి.. ప్రియుడి కోసం తండ్రినే బోల్తా కొట్టించేంత పనిచేసింది. సంపన్న వర్గానికి చెందిన యువతి కావడంతో.. ఆమె నుంచి ప్రియుడు డబ్బులు ఆశించాడు.

అయితే డబ్బుకు బదులు తన తండ్రిని దొంగిలించమని ఆ యువతి ఉచిత సలహా ఇచ్చింది. చివరకు విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. అసలు సంగతి బయటపడింది. చెన్నైలోని కోడంబాక్కంలో ఈ ఘటన వెలుగుచూసింది.

 girl suggested to boyfriend to theft her father car

పోలీసుల కథనం ప్రకారం.. కొడంబాక్కంకు చెందిన పారిశ్రామికవేత్త షణ్ముగరాజన్(47) కుమార్తె ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన చందు అనే యువకుడితో ప్రేమలో పడింది. యువతి శ్రీమంతుల బిడ్డ కావడంతో.. ఆమె నుంచి డబ్బు ఆశించిన ప్రియుడు.. ఆమెతో అదే విషయాన్ని చెప్పాడు.

అయితే ప్రియురాలు మాత్రం.. తన తండ్రి కారును దొంగిలించి దాన్ని అమ్మేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సహకరించింది కూడా. దీంతో ప్రియురాలి సహాయంతో చందు కారును దొంగిలించాడు. ఇదంతా తెలియని ప్రియురాలి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన కారు కనిపించడం లేదని వెతికిపెట్టాలని కోరాడు.

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కారు గురించి ఆరా తీయగా.. వ్యాసార్పాడి కల్యాణపురం ప్రాంతానికి చంద్రు ఈ దొంగతనం చేసినట్లుగా తేలింది. షణ్ముగరాజన్ కూతురే తనకు ఈ సలహా ఇచ్చిందని చంద్రు వెల్లడించాడు. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+