girl private school class student missing midnight forest lover youth family wife husband legs hands kidnapped police bengaluru అమ్మాయి ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మిస్సింగ్ అడవి లవర్ యువకులు ఫ్యామిలీ భార్య భర్త కాళ్లు చేతులు కిడ్నాప్ పోలీసు బెంగళూరు
Girl: విద్యార్థిని కిడ్నాప్, అర్దరాత్రి అడవిలో ఏం జరిగింది ?, కాళ్లు, చేతులు కట్టేసి, ఎలా సాధ్యం !
బెంగళూరు/మంగళూరు: స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరిన 10వ తరగతి విద్యార్థిని మాయం అయ్యింది. అమ్మాయి కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అర్దరాత్రి దాటిన తరువాత మాయం అయిన విద్యార్థిని అటవి ప్రాంతంలో ప్రత్యక్షం అయ్యింది. అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి ఆమెను చెట్టుకు కట్టేయడం కలకలం రేపింది. తనను ముగ్గురు వ్యక్తులు బైక్ లో కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు చెప్పడంతో కథకొత్త మలుపు తిరిగింది. అర్దరాత్రి అడవిలో ఏం జరిగింది ?, బస్సులో బయలుదేరిన అమ్మాయిని బైక్ లో ఎలా కిడ్నాప్ చేశారు ? అంటూ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Aunty: నెలకు రూ. 3 లక్షలు ఆధాయం, అదిరిపోయే ఆంటీ, చిత్తూరు, హైదరాబాద్ లో ?

ప్రైవేట్ స్కూల్ అమ్మాయి
ఉత్తర కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని యల్లాపుర తాలుకాలోని నందోళ్ళి ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల అమ్మాయి యల్లాపురలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ ఇంటి నుంచి బస్సులో ఆ అమ్మాయి స్కూల్ వెలుతోంది. సాయంత్రం స్కూల్ పూర్తి అయిన తరువాత బస్సులోనే ఆ అమ్మాయి ఇంటికి వెలుతోంది.

అమ్మాయి మాయం
బుధవారం ఉదయం అమ్మాయి స్కూల్ కు వెళ్లింది. సాయంత్రం వరకు స్కూల్ లో ఉన్న అమ్మాయి తరువాత బస్సులో ఇంటికి బయలుదేరింది. ఇంటికి బయలుదేరిన అమ్మాయి కనపడకుండా పోయింది. రాత్రి అయినా అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

అమ్మాయి ఎక్కడ ?
అమ్మాయి కోసం బంధువులు, ఆమె స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు యల్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు అమ్మాయి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత మాయం అయిన అమ్మాయి గ్రామం సమీపంలోని అటవి ప్రాంతంలో ప్రత్యక్షం కావడంతో అందరూ హడలిపోయారు.

బైక్ లో అమ్మాయి కిడ్నాప్ !
కనపడకుండా పోయిన అమ్మాయి చేతులు, కాళ్లు కట్టేసి ఆమెను అటవి ప్రాంతంలోని ఓ చెట్టుకు కట్టేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవినాయక్, సీఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటికి వెలుతున్న తనను బైక్ లో వచ్చిన ముగ్గురు యువకులు అడ్రస్ అడిగెనెపంతో పలకరించారని, తరువాత బైక్ లో కిడ్నాప్ చేశారని అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

అర్దరాత్రి అడవిలో ఏం జరిగింది ?
బైక్ లో వచ్చిన ముగ్గురు యువకులు ఎవరు ?, బస్సులో ఇంటికి బయలుదేరిన అమ్మాయిని బైక్ లో ఎలా కిడ్నాప్ చేశారు ?, అర్దరాత్రి అడవిలో ఏం జరిగింది ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10వ తరగతి అమ్మాయి కిడ్నాప్ కావడం, అడవిలో ఆమె ప్రత్యక్షం కావడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్మాయిల కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు.