కౌశల్ ఇంటికి బుల్డోజర్ల మీద వెళ్లిన లేడీ పోలీస్ ఆఫీసర్లు, సార్ ఇంత వరకు చిక్కలేదని, క్లై మాక్స్ !
భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నిందితులకు శిక్ష విధించే విషయంలో పరిస్థితులు కొంచెం అంటూ ఇటుగా ఉన్నాయి.
భోపాల్/మధ్యప్రదేశ్: నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోనే చాలా వరకు దేశాల్లో ఇలాగే జరుగుతోంది. అయితే భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నిందితులకు శిక్ష విధించే విసయంలో పరిస్థితులు కొంచెం అంటూ ఇటుగా ఉన్నాయి.
ఉత్దరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఓ కొత్త చట్టం అమలు చెయ్యడం మొదలుపెట్టారు. నిందితులను శిక్షించడానికి బుల్డోజర్ లను రంగంలో దింపడం మొదలుపెట్టారు. నిందితులు నివాసం ఉంటున్న ఇంటితో పాటు వారి ఆస్తులను నాశనం చేస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యలపాలు చేస్తే ఇలాంటి శిక్షలు తప్పవు అని బీజేపీ సీఎంలు హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సామూహిక అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని మహిళా పోలీసు బుల్‌డోజర్‌లను ఉపయోగించి కూల్చివేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయం కొనసాగుతోంది. మైనర్ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 260 కిలోమీటర్ల దూరంలోని దామోహ్‌లో చోటుచేసుకుంది.
ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నాలుగో వ్యక్తి కౌశల్ కిషోర్ చౌబే పరారీలో ఉన్నాడు. ఆక్రమిత స్థలంలో కౌశల్ అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అందుకే కౌశల్ ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేశారని పోలీసు అధికారులు తెలిపారు. మహిళా అధికారుల బృందం బుల్డోజర్‌ను ఆపరేట్ చేసి కామాంధుడు కౌశల్ ఇంటిని కూల్చివేసింది. మహిళా అధికారులు మంచి పని చేసారని, నిందితులకు బుద్ది చెప్పడానికి ఇలాంటి చర్యలు కొనసాగుతాయని రాణే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రషితా కుర్మి స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications