Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girl: తండ్రి రెండో భార్య కూతురు, ఇంటికి వెళ్లి కౌశిక్ ఏం చేశాడంటే ?, వీడికి ఏం పోయేకాలం వచ్చిందో ?

చెన్నై/ క్రిష్ణగిరి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అనారోగ్యంతో చనిపోయింది. బంధువులు ఒత్తిడి చెయ్యడంతో అతను మరో యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య పిల్లలు, రెండో భార్య, ఆమె పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిలో షాకింగ్ మ్యాటర్ బయటకు వచ్చింది.

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని బర్కూర్ ప్రాంతంలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం రాజేష్ కు వివాహం అయ్యింది. రాజేష్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో రాజేష్ భార్య 2016లో మృతి చెందింది. భార్య చనిపోయిన తరువాత కొంతకాలం పాటు రాజేష్ అతని కుమారులను చూసుకుంటూ అలాగే కాలం గడిపేశాడు.

తరువాబ బంధువులు వేరే పెళ్లి చేసుకోవాలని రాజేష్ మీద ఒత్తిడి చేశారు. ఇద్దరు కొడుకుల సంరక్షణ కోసం రాజేష్ మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. రాజేష్, అతని రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. మొదటి భార్య పిల్లలు, రెండో భార్య, ఆమె పిల్లలతో కలిసి రాజేష్ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

Girl: The young man who sexually assaulted his stepmothers daughter was under the influence of drugs in near Krishnagiri Tamil Nadu.

రాజేష్ రెండో భార్య బర్కూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె సవతి పెద్ద కుమారుడు కౌశిక్ మీద ఫిర్యాదు చేసింది. అందులో ఆమె భర్త మొదటి భార్య 21 ఏళ్ల కుమారుడు కౌశిక్ తనకు పుట్టిన 5 ఏళ్ల కుమార్తెను నిత్యం లైంగికంగా వేధించాడని నివేదిస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. మహిళ ఫిర్యాదు అందుకున్నబార్కూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అముద విచారణ చేపట్టారు.

గంజాయి తాగే అలవాటు ఉన్న రాజేష్ పెద్ద కుమారుడు కౌశిక్ రెండు రోజుల క్రితం గంజాయి తాగి ఇంటికి వెళ్లాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన సవతి తల్లి 5 ఏళ్ల కూతురి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్ పెద్ద కుమారుడు కౌశిక్‌ను పోక్సో కేసులో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గంజాయి మత్తులో అన్నయ్య తన చెల్లెలిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+