మిస్టరీ: సీలింగ్‌కు వేలాడుతూ హాస్టల్ గదిలో మహిళా అథ్లెట్
చండీగఢ్: హర్యానాలోని క్రీడా పాఠశాల హాస్టల్ గదిలో ఓ మహిళా రెజ్లర్ పైకప్పునకు ఉరి వేసుకుని మరణించింది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 19 రోజుల్లో హిస్సార్ జిల్లాలో ఇటువంటి విషాద సంఘటన జరగడం ఇది రెండోసారి.
హర్యానాలోని హిస్సార్ జిల్లా నిదానిలో గల భరత్ సింగ్ మెమోరియల్ స్పోర్ట్స్ స్కూల్లో మోనీ అనే అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ఆమె స్వస్థలం అదే జిల్లాలోని మోహాలా గ్రామం. శుక్రవారంనాడు మోనీ తన హాస్టల్ గదిలో పైకప్పునకు ఉరేసుకుని కనపించింది. దర్యాప్తు అధికారి రామ్ మెహర్ సింగ్ శనివారంనాడు ఆ విషయం చెప్పారు

శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. మృతికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి విసరాను వైద్య పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకుందా, మరేమైనా కారణం ఉందా అనేది దర్యాప్తు తర్వాతనే తేలుతుందని ఆయన అన్నారు.
సమస్య ఏదైనా ఉందా అనేది తెలియదని, తనకు సమస్య ఉన్నట్లు ఎవరితోనో ఆమె చెప్పలేదని స్కూల్ ప్రిన్సిపాల్ రజ్వంత్ మాలిక్ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన శుభం అనే అమ్మాయి కూడా హాస్టల్ గదిలో జనవరి 26వ తేదీన పైకప్పునకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది.












Click it and Unblock the Notifications