Girlfriend: బర్త్ డే పార్టీ, అర్దరాత్రి రోడ్డు పక్కన చంపేసిన మాజీ బాయ్ ఫ్రెండ్+ ముగ్గురు మిత్రులు!

న్యూఢిల్లీ: పుట్టిరోజు యువతి కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసింది. అర్దరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి 15 నిమిషాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న యువతి తరువాత తాను స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి మరుసటి రోజు ఉదయం ఇంటికి వస్తానని చెప్పింది. పుట్టిన రోజు యువతిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకున్న ఆమె కుటుంబ సభ్యులు సరే అన్నారు. ఉత్సాహంగా యువతి ఇంటి నుంచి వెళ్లింది. రెండు మూడు గంటల తరువాత యువతి కుటుంబ సభ్యులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ అమ్మాయి రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడిఉందని ఫోన్ చేసి చెప్పాడు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. పుట్టిన రోజునాడే యువతి హత్యకు గురి కావడంతో ఆమె స్నేహితులు హడలిపోయారు. ముగ్గురు స్నేహితులు యువతిని హత్య చేశారని పోలీసులు అంటున్నారు. యువతి హత్య కేసులో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అరెస్టు కావడం కలకలం రేపింది.

బర్త్ డే బేబి ఫుల్ హ్యాపి

బర్త్ డే బేబి ఫుల్ హ్యాపి

దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని బిందాపూర్ ప్రాంతంలో 22 ఏళ్ల సీమా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. మంగళవారం అర్దరాత్రి 12 గంటల సమయంలో సీమా ఆమె ఇంటిలో కుటుంబ సభ్యుల, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.

సంతోషంగా బయటకు పంపించారు

సంతోషంగా బయటకు పంపించారు

అర్దరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి 15 నిమిషాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సీమా అందరికి కేక్ తినిపించింది. తరువాత తాను స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి మరుసటి రోజు ఉదయం ఇంటికి వస్తానని సీమా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అర్దరాత్రి కావడంతో మొదట సీమా కుటుంబ సభ్యులు కొంచెం ముందు వెనుకా ఆలోచించారు.

 ఉత్సాహంగా వెళ్లింది.... ఒక్క ఫోన్ కాల్ తో?

ఉత్సాహంగా వెళ్లింది.... ఒక్క ఫోన్ కాల్ తో?

పుట్టిన రోజు సీమాను ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకున్న ఆమె కుటుంబ సభ్యులు సరే జాగ్రత్తగా వెళ్లి రావాలని ఆమెకు సూచించారు. సీమా ఉత్సాహంగా ఇంటి నుంచి వెళ్లింది. రెండు మూడు గంటల తరువాత సీమా కుటుంబ సభ్యులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ అమ్మాయి సీమా రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడిఉందని, మీరు వెంటనే రావాలని ఫోన్ చేసి చెప్పాడు.

అప్పటికే ప్రాణం పోయింది

అప్పటికే ప్రాణం పోయింది

హడలిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకని సీమాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సీమా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. సీమా శరీరం మీద అనేక చోట్ల గాయాలైనాయి. కత్తిపోట్లకు గురైన సీమాకు ఎక్కువ రక్తం పోవడం వలన ఆమె మరణించిందని పోలీసులు అన్నారు.

మాజీ బాయ్ ఫ్రెండ్+ ముగ్గురు మిత్రులు

మాజీ బాయ్ ఫ్రెండ్+ ముగ్గురు మిత్రులు

కేసు నమోదు చేసిన పోలీసులు సీమా మొబైల్ ఫోన్ కాలాడేటా ఆధారంగా ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అంకిత్ అనే యువకుడిని అరెస్టు చేశారు. గతంలో సీమా, అంకిత్ చాలా సన్నిహితంగా ఉండేవారని, కొంతకాలం నుంచి సీమా అతన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసిందని పోలీసులు అన్నారు. తన ప్రియురాలు తనకు దూరం అవుతోందని తట్టుకోలేక అంకిత్ అతని స్నేహితులతో కలిసి సీమాను హత్య చేసి ఉంటాడని పోలీసులు అంటున్నారు.

Recommended Video

    Deepak Chahar Love Story ప్రపోజ్ వెనుక MS Dhoni మాస్టర్ మైండ్ | Who is Jaya Bhardwaj?|| Oneindia
    బర్త్ డే రోజు యువతి హత్య

    బర్త్ డే రోజు యువతి హత్య

    పుట్టిన రోజునాడే సీమా హత్యకు గురి కావడంతో ఆమె స్నేహితులు హడలిపోయారు. ముగ్గురు స్నేహితులు సీమాను హత్య చేశారని పోలీసులు అంటున్నారు. సీమా హత్య కేసులో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అంకిత్ అరెస్టు కావడం కలకలం రేపింది. తప్పించుకుని పారిపోయిన అంకిత్ ముగ్గురు మిత్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+