Girlfriend: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిని 49 సార్లు కత్తితో పొడిచి, కోరిక తీరిన తరువాత?
సూరత్/భువనేశ్వర్: ఒకే ప్రాంతంలో ఉన్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. చాలాకాలం నుంచి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియురాలి కంటే ప్రియుడు డబ్బులో, ఆస్తిలో ఓ మెట్టు ఎక్కువగానే ఉన్నాడు. పెళ్లి చేసుకుందామని కొంతకాలం నుంచి ప్రియురాలు ఆమె ప్రియుడి మీద ఒత్తిడి చేసింది.
తరువాత పెళ్లి చేసుకుందామని ప్రియుడు ఆమెకు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని ప్రియురాలి నమ్మించి వేరే రాష్ట్రానికి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు ఆమెను 49 సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేసి శవం అక్కడే విసిరి అతని సొంత ఊరికి వెళ్లిపోయి చేతులు దులుపుకున్నాడు.

లవర్స్
ఒడిశాలోని భువనేశ్వర్ లోని జగన్నాథ్ గోదా అలియాస్ జగన్నాథ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భవనేశ్వర్ లో నివాసం ఉంటున్న గుణిగార్ సీమా అలియాస్ సీమాకు జగన్నాథ్ ముందునుంచి పరిచయం ఉంది. మూడు సంవత్సరాల నుంచి సీమా, జగన్నాథ్ ప్రేమించుకుంటున్నారు.

ఎంజాయ్ చేసిన ప్రియుడు
ఒకే ప్రాంతంలో ఉన్న ప్రేమికులు జగన్నాథ్, సిమా నిత్యం కలుస్తున్నారు. చాలాకాలం నుంచి ప్రేమికులు సీమా, జగన్నాథ్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియురాలు సీమా కంటే ఆమె ప్రియుడు జగన్నాథ్ డబ్బులో, ఆస్తిలో ఓ మెట్టు ఎక్కువగానే ఉన్నాడు. సీమాను శారీరకంగా లొంగదీసుకున్న జగన్నాథ్ ఆమెతో కోరిక తీర్చుకున్నాడు.

ప్రియురాలి టార్చర్ ఎక్కువ అయ్యిందని?
ఇటీవల మనం పెళ్లి చేసుకుందామని ప్రియురాలు సీమా ఆమె ప్రియుడు జగన్నాథ్ మీద ఒత్తిడి చేసింది. అయితే ఇంతకాలం ఎంజాయ్ చేసిన జగన్నాథ్ అతని ప్రియురాలు సీమాను పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులతో పాటు కులం అడ్డు వచ్చింది, వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందామని జగన్నాథ్ చెప్పినా అందుకే సీమా అంగీకరించలేదు.

సూరత్ లో చంపేసి ఎస్కేప్
పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు సీమాను నమ్మించిన జగన్నాథ్ ఆమెను గుజరాత్ లోని సూరత్ పిలుచుకుని వ వెళ్లాడు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం జగన్నాథ్ అతని ప్రియురాలు సీమాను 49 సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. సిమా శవం అక్కడే విసిరి అతని సొంత ఊరికి వెళ్లిపోయి చేతులు దులుపుకున్నాడు.

సీసీటీవీల దెబ్బతో ప్రియుడికి?
మొదట హత్యకు గురైయ్యింది సీమా అని వెలుగు చూడలేదు. తరువాత సీమా వేసుకున్న దుస్తుల ఆధారంగా రైల్వేస్టేషన్, బస్ స్టాండ్ లలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన సూరత్ పోలీసులు గురువారం భువనేశ్వర్ లో శాడిస్టు ప్రియుడు జగన్నాథ్ ను అరెస్టు చేశారు. సీమా హత్యకు జగన్నాథ్ కు ఎవరైనా సహరించారా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications