Girlfriend: భర్తకు బాయ్ బాయ్, భార్య అక్రమ సంబంధం, ప్రియుడు ఏం చేశాడంటే, అన్నతో గేమ్స్ !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళకు నీ భర్తతో చక్కగా కాపురం చెయ్యాలని, జీవితాంతం అతనితో సంతోషంగా ఉండాలని చెప్పిన కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటికి పంపించారు. వివాహం జరిగిన కొంతకాలానికే దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. భర్తకు గుడ్ బై చెప్పిన భార్య ఆమె పుట్టింటికి చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నది. ఫైనాన్స్ వ్యాపారం, ఫైనాన్స్ లో వాహనాలు కొనుగోలు చేసి ఈఎంఐలు కట్టకుండా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసే పని చేస్తున్న వ్యక్తితో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. అయితే ప్రియుడితో తేడాలు రావడంతో ఆమె అతన్ని దూరం పెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతకాలం పడక సుఖం ఇచ్చిన ప్రియురాలు దగ్గరకు రాకపోవడంతో ప్రియుడు రగిలిపోయాడు. ప్రియురాలిని లొంగదీసుకోవడానికి ఆమె అన్నను కిడ్నాప్ చేసిన ప్రియుడు అతన్ని సిటీ మొత్తం కారులో తిప్పుతూ నరకం చూపించాడు, మర్యాదగా నా దగ్గరకు వచ్చి పడక సుఖం ఇవ్వాలని, లేదంటే మీ అన్నను చంపేస్తానని ప్రియుడు అతని ప్రియురాలికి వీడియో కాల్ చేసి సినిమా లెవల్లో కిడ్నాప్ చేసిన అన్నను ఆమెకు చూపించి రెచ్చిపోయాడు.

మహిళకు వివాహం చేసిన కుటుంబ సభ్యులు
బెంగళూరు నగరంలోని హారోహళ్ళి ప్రాంతంలో శీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం శీతల్ కు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న శీతల్ కు నీ భర్తతో చక్కగా కాపురం చెయ్యాలని, జీవితాంతం అతనితో సంతోషంగా ఉండాలని చెప్పిన కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటికి పంపించారు.

భర్తకు టాటా చెప్పేసిన మహిళ
వివాహం జరిగిన కొంతకాలానికే శీతల్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. భర్తకు గుడ్ బై చెప్పిన శీతల్ హారోహళ్ళిలోని ఆమె పుట్టింటికి చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నది. ఫైనాన్స్ వ్యాపారం, ఫైనాన్స్ లో వాహనాలు కొనుగోలు చేసి ఈఎంఐలు కట్టకుండా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసే పని చేస్తున్న హెగ్గనహళ్ళి నివాసి శ్రీనివాస్ అలియాస్ బోట్టుతో భర్తకు దూరంగా ఉంటున్న శీతల్ కు పరిచయం అయ్యింది.

భర్త దూరం అయినా ప్రియుడు ఉన్నాడని ?
భర్తకు దూరంగా ఉంటున్నశీతల్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. కొంతకాలం నుంచి శ్రీనివాస్, శీతల్ ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. భర్త దూరం అయినా ప్రియుడు శ్రీనివాస్ ఉన్నాడని ఇంతకాలం శీతల్ కాలం గడిపేసింది. అయితే ప్రియుడె శ్రీనివాస్ తేడాలు రావడంతో శీతల్ అతన్ని కూడా దూరం పెట్టింది.

ప్రియురాలి అన్నను కిడ్నాప్ చేసిన ప్రియుడు
శీతల్ ను దగ్గర చేసుకోవాలని శ్రీనివాస్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతకాలం తనకు పడక సుఖం ఇచ్చిన ప్రియురాలు శీతల్ దగ్గరకు రాకపోవడంతో ఆమె మాజీ ప్రియుడు శ్రీనివాస్ రగిలిపోయాడు. ప్రియురాలు శీతల్ ను లొంగదీసుకోవడానికి ఆమె అన్నను కిడ్నాప్ చెయ్యాలని ఆమె మాజీ ప్రియుడు శ్రీనివాస్ స్కెచ్ వేశాడు.

కారులో కిడ్నాప్ చేసి
ప్రియురాలు శీతల్ అన్నను కిడ్నాప్ చెయ్యడానికి శ్రీనివాస్ బెంగళూరులోని బసవేశ్వర నగరలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ శివకుమార్, హుచ్చేగౌడ, ఆకాష్, గంగాధర్, ప్రతాప్ సహాయం తీసుకున్నాడు. రాత్రి 7.30 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన శీతల్ అన్నను శ్రీనివాస్, అతని ఫ్రెండ్స్ కారులో కిడ్నాప్ చేశారు.

దెబ్బకు మైండ్ బ్లాక్
శీతల్ అన్నను కిడ్నాప్ చేసిన ప్రియుడు శ్రీనివాస్ అతని స్నేహితులు బాధితుడిని బెంగళూరు సిటీ మొత్తం కారులో తిప్పుతూ అతని మద దాడి చేసి నరకం చూపించారు, ప్రియురాలు శీతల్ కు వీడియో కాల్ చేసిన శ్రీనివాస్ మర్యాదగా నా దగ్గరకు వచ్చి పడక సుఖం ఇవ్వాలని, లేదంటే మీ అన్నను చంపేస్తానని బెదిరించాడు.

ప్రియురాలితో గేమ్స్ ఆడిన ప్రియుడు ?
మాజీ ప్రియుడు శ్రీనివాస్ వీడియో కాల్ చేసి సినిమా లెవల్లో కిడ్నాప్ చేసిన అన్నను చూపించి చంపేస్తానని రెచ్చిపోవడంతో శీతల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడు శ్రీనివాస్ తో పాటు బసవేశ్వర నగరలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ శివకుమార్, హుచ్చేగౌడ, ఆకాష్, గంగాధర్, ప్రతాప్ లను అరెస్టు చేసి శీతల్ అన్నను క్షేమంగా రక్షించారు.












Click it and Unblock the Notifications