స్టూడెంట్‌తో ప్రోఫెసర్ సహజీవనం: షాకిచ్చిన లవర్, లవ్ స్కూల్‌కు సన్నాహలు

పాట్నా: లవ్‌గురుగా పేరొందిన బీహార్ రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ళ ప్రోఫెసర్ మాటుక్‌నాథ్ చౌదరికి ప్రియురాలు షాకిచ్చింది. స్టూడెంట్‌తో ప్రేమలో పడిన ఆమెను పెళ్ళి చేసుకొన్న చౌదరికి పదేళ్ళ తర్వాత ప్రియురాలు షాకిచ్చింది. స్టూడెంట్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ప్రోఫెసర్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన భార్య అతడిని విడిచిపెట్టింది. పెళ్ళి చేసుకొన్న ప్రియురాలు కూడ ఆథ్మాత్మిక మార్గంలో పయనించాలని భావించింది. దీంతో లవ్ ప్రోఫెసర్ ఒంటరివాడుగా మిగిలిపోయారు.

బీహార్ రాష్ట్రంలోని 64 ఏళ్ళ మాటుక్‌నాథ్ చౌదరి లవ్ గురుగా ప్రసిద్ది చెందాడు . మాటుక్ చౌదరి ప్రేమాయాణాన్ని ఆయన భార్య బట్ట బయలు చేసింది. ఓ టీవీ ఛానెల్‌ సహయంతో మాటుక్ చౌదరి లవ్ ఎఫైర్‌ను 2006లో ఆమె బయటపెట్టింది.

ఈ ఘటనతో భర్తతో ఆమె విడిపోయింది. అయితే తన జీతంలో భార్యకు మనోవర్తి కింద ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నాడు. మాటుక్ చౌదరి. అయితే భార్య వెళ్ళిపోయాక కూడ స్టూడెంట్ ప్రేయసితో జీవితాన్ని కొనసాగించాడు మాటుక్ చౌదరి

ఒంటరైన లవ్ గురు

ఒంటరైన లవ్ గురు

బీహార్ రాష్ట్రానికి చెందిన లవ్ గురుగా పేరొందిన ప్రోఫెసర్ మాటుకు చౌదరి ఒంటరిగా మారిపోయాడు పదేళ్ళ క్రితం జవహర్‌లాల్ యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్ జూలీ కుమారితో ప్రేమాయాణాన్ని మూటుకు చౌదరి నడిపారు. ఈ విషయాన్ని చౌదరి భార్య 2006లో ఓ టీవి ఛానెల్ సహయంతో బయటపెట్టింది. అప్పటి నుండి జూలీ కుమారితోనే మాటుకు చౌదరి ఉంటున్నాడు కానీ, ప్రస్తుతం జూలీ కుమారి ఆథ్మాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయం తీసుకొంది. జూలీ కుమారితో సహాజీవనం చేస్తున్న విషయాన్ని బట్టబయలు చేసిన నాటి నుండి భర్తకు దూరంగా భార్య ఉంటుంది.దీంతో ప్రోఫెసర్ మాటుకు చౌదరి ఒంటరివాడయ్యాడు.

షాకిచ్చిన ప్రియురాలు

షాకిచ్చిన ప్రియురాలు

స్టూడెంట్ ప్రియురాలైన జూలీ కుమారి పదేళ్ళపాటు మాటుక్ చౌదరితో ఉంది. అయితే ఇటీవలనే ఆమె ఆథ్మాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకొంది. అనుహ్యంగా ప్రియురాలు తీసుకొన్న నిర్ణయం మాటుక్ చౌదరి షాక్‌కు గురి చేసింది. తన ప్రియురాలైన జులీ ఆథ్యాత్మిక జీవితం గడుపుతూ పుదుచ్చేరి, రిషికేష్, పూణేలోని ఓషో ఆశ్రమాల్లో గడుపుతోందని లవ్ గురు మాటుక్ నాథ్ చౌదరి చెప్పాడు.

ప్రేమ పాఠశాల ఏర్పాటు

ప్రేమ పాఠశాల ఏర్పాటు

స్టూడెంట్ ప్రియురాలు తన జీవితంలోకి రావడంతో భార్య వదిలేసి వెళ్ళిపోయింది. పదేళ్ళ తర్వాత స్టూడెంట్ ప్రియురాలు ఆథ్మాత్మిక బాటలో పయనిస్తోంది. దీంతో తాను ఒంటరిగా మిగిలినట్టుగా మాటుక్ చౌదరి చెప్పారు. అక్టోబర్ మాసంలో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ప్రేమికుల కోసం భాగల్పూరు జిల్లాలో ప్రేమ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు లవ్ గురు మాటుక్ చౌదరి చెప్పారు.

లవ్‌గురుగా పేరొందిన మాటుకు చౌదరి

లవ్‌గురుగా పేరొందిన మాటుకు చౌదరి

అధిక మార్కులేస్తానని విద్యార్థినులను ప్రొఫెసరు లొంగదీసుకున్నాడని మాటుక్ చౌదరిపై ఆరోపణలు రావడంతో ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. విద్యార్థినితో ప్రేమలో పడిన ప్రొఫెసరు తాను సహజీవనం చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో బీహార్ ‘లవ్ గురు'గా ప్రొఫెసరు వార్తల్లోకెక్కాడు. ఆనాటి నుండి మాటుక్ చౌదరి లవ్‌గురుగా పేరొందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+