• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girlfriend: ప్రియుడి హత్య, మూడు నెలల క్రితం ?, ఈసారి స్ట్రాంగ్ గా విషం ఇచ్చిన గిరిష్మా !

|
Google Oneindia TeluguNews

కన్యాకుమారి/తిరువనంతపురం: ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పిందని సమాచారం. ప్రియుడిని హత్య చేసిన గిరిష్మా చేతులు దుపులుకోవాలని వేసిన ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రియుడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని అనుకున్న గిరిష్మా ఇన్ని రోజులు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అనేక స్టేట్ మెంట్ లు ఇచ్చింది. అయితే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, తమిళనాడు పోలీసులు గిరిష్మాను ఆమె ఇంటికే పిలుచుకుని వెళ్లి ఆధారాలు సేకరించారు. ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే గిరిష్మా బోరున ఏడ్చేసింది. ముఖం కనపడుకుండా పంజాబీ డ్రెస్ వేల్ ను గిరిష్మా ఆమె ముఖం మీద వేసుకుంది. మూడు నెలల క్రితమే ప్రియుడు షారోన్ కు విషయం ఇచ్చిన గిరిష్మా అతను చనిపోలేదని ఈసారి కొంచెం స్ట్రాంగ్ విషం ఇవ్వడంతో ప్రియుడు చనిపోయాడని వెలుగు చూసింది.

Lady teacher: మేడమ్ స్కెచ్, 16 ఏళ్ల అబ్బాయికి లిక్కర్ తాగించి మజా చేస్తున్న టీచర్ !Lady teacher: మేడమ్ స్కెచ్, 16 ఏళ్ల అబ్బాయికి లిక్కర్ తాగించి మజా చేస్తున్న టీచర్ !

 ప్రియురాలు రివర్స్ గేర్

ప్రియురాలు రివర్స్ గేర్

కేరళలోని పరసాల మురియాంకరైలో నివాసం ఉంటున్న షారోన్ రాజ్ అలియాస్ షారోన్ (23), తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కలియకవిలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో నివాసం ఉంటున్నగిరిష్మా (22) ప్రేమించుకున్నారు, షారోన్ తో ఎంజాయ్ చేసిన తరువాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ కావడంతో గతంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలతో షారోన్ ఆమెను బెదిరించాడు.

 ప్రియురాలి మాస్టర్ ప్లాన్ కు ప్రియుడు బలి

ప్రియురాలి మాస్టర్ ప్లాన్ కు ప్రియుడు బలి

మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చెయ్యడానికి షారోన్ రాజ్ అంగీకరించకపోవడంతో అతనితో గిరిష్మా గొడవపడింది. గిరిష్మా ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పడం, షారోన్ ఆమె ఇంటికి వెళ్లడం, గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్ రాజ్ కు ఇవ్వడం, కొన్ని రోజుల తరువాత ఆసుపత్రిలో చికిత్స విఫలమై షారోన్ చనిపోయాడు.

 ఏం జరిగిందో చెబుతున్న గిరిష్మా

ఏం జరిగిందో చెబుతున్న గిరిష్మా

షారోన్ ను ఆమె ప్రియురాలు గిరిష్మా హత్య చేసిందని ఇప్పటికే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గిరిష్మాను కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు న్యాయమూర్తి అనుమతితో విచారణ చెయ్యడానికి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, తమిళనాడు పోలీసులు గిరిష్మాను విచారణ చేస్తున్నారు.

 గిరిష్మా సైలెంట్.... ముఖం కనపడకుండా ?

గిరిష్మా సైలెంట్.... ముఖం కనపడకుండా ?

ఇప్పటికే గిరిష్మా ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. అరెస్టు అయిన తరువాత గిరిష్మాను ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లిన పోలీసులు షారోన్ కు ఎలా విషయం కలిపి ఇచ్చావు అని చెప్పాలని సూచించారు. ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే గిరిష్మా ఆమె ఇన్ని రోజులు చదువుకుంటున్న సమయంలో తీసుకున్న షీల్డులు, ట్రోఫీలు చూసి బోరున ఏడ్చేసింది. షారోన్ కు ఎక్కడ విషం కలిపిన జ్యూస్ ఇచ్చింది. అతను ఇంట్లో ఎంత సేపు ఉన్నాడు. ఇంట్లో ఇద్దరూ ఏం చేశారు అని గిరిష్మా పోలీసులకు చెప్పింది. ముఖం కనపడుకుండా పంజాబీ డ్రెస్ వేల్ ను గిరిష్మా ఆమె ముఖం మీద వేసుకుంది.

 వీడియో చిత్రీకరణ

వీడియో చిత్రీకరణ

గిరిష్మా, ఆమె ప్రియుడు షారోన్ రాజ్ తిరిగిన ప్రాంతాలకు గిరిష్మాను పిలుచుకుని వెళ్లి వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాలాలో, గిరిష్మా ఇంటిలో ఆమె చెప్పిన సమాచారం మొత్తం వీడియో చిత్రీకరించిన పోలీసులు ఆ వీడియో సాక్షాలను కోర్టు ముందు సమర్పించడానికి సిద్దం అయ్యారు.

 జ్యూస్ చాలెంజ్ స్కెచ్

జ్యూస్ చాలెంజ్ స్కెచ్

మూడు నెలల క్రితమే ప్రియుడు షారోన్ కు విషయం ఇచ్చి హత్య చెయ్యాలని గిరిష్మా స్కెచ్ వేసింది. రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకున్న గిరిష్మా ఆమె ప్రియుడు షారోన్ బైక్ లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సందర్బంలో గిరిష్మా జ్యూస్ చాలెంజ్ పోటీ పెట్టింది. షారోన్ కు ఓక జ్యూస్ బాటిల్ ఇచ్చిన గిరిష్మా మరో బాటిల్ ఆమె తీసుకుని ఎవరు ముందుగా జ్యూస్ తాగుతారో అని పోటీ పెట్టింది.

 ఈసారి స్ట్రాంగ్ విషం కలిపిన గిరిష్మా

ఈసారి స్ట్రాంగ్ విషం కలిపిన గిరిష్మా

షారోన్ తో కలిసి గిరిష్మా కూడా జ్యూస్ తాగింది. అయితే షారోన్ తాగిన జ్యూస్ లో మాత్రమే గిరిష్మా విషం కలిపింది. రెండు నెలల పాటు వాంతులు, విరేచనాలు చేసుకున్న షారోన్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ప్రియుడు షారోన్ చనిపోకపోవడంతో ఈసారి గిరిష్మా జ్యూస్ లో కొంచెం స్ట్రాంగ్ విషం కలిపి ఇవ్వడంతో అతను చనిపోయాడని కేరళ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Greeshma bursts into tears seeing awards and trophies who entered her house near Kanyakumari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X