Girlfriend: ఫోన్ చేసి ప్రేమగా పిలిచింది, పోలీసులను తికమకపెట్టింది, శాడిస్టు ప్రియురాలి ఇల్లు, ఫినిష్ !
తిరువనంతపురం/కన్యాకుమారి: పెళ్లి విషయంలో లొళ్లి చేస్తున్నాడని ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పిందని వెలుగు చూసింది. స్లోపాయిజన్ తో తన ప్రియుడిని ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంలో ప్రియురాలు గిరిష్మా రెండుమూడు కోణాల్లో చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారని తెలిసింది. జ్యోతిష్యుడి కారణంగా తన ప్రియుడిని తాను హత్య చెయ్యలేదని రెండోసారి గిరిష్మా చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తన ప్రియుడు నేను చెప్పిన మాట వినలేదని, అతని మొబైల్ ఫోన్ లో ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చెయ్యడానికి అంగీకరించలేదని, అదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని గిరిష్మా పోలీసులకు చెప్పిందని తెలిసింది.
Karnataka Ratna: అవార్డుకు కల వచ్చింది, దేవుడిబిడ్డ అంటే పునీత్ రాజ్ కుమార్: రజనీకాంత్, ఎన్టీఆర్!
డిగ్రీపూర్తి చేసి ఉద్యోగం చేస్తాడని అనుకుంటే ?
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని పరసలై మురియాంకరై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ అలియాస్ షారోన్ (23) అనే యువకుడు రేడియాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చెయ్యడంతో అతను మంచి ఉద్యోగం చేస్తాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే షారోన్ కేరళకు చెందిన గిరిష్మా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
ఫోన్ చేసి ప్రేమగా పిలించింది
కేరళలోని కలియకవిలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి గిరిష్మా కూడా షారోన్ ను ప్రేమించింది. ప్రేమికులు షారోన్, గిరిష్మా చాలా సంతోషంగా తిరిగారు. గత నెల 14వ తేదీన ప్రియురాలు గిరిష్మా తన ఇంటికి రావాలని ఆమె ప్రియుడు షారోన్ కు ఫోన్ చేసి చెప్పింది.
స్లోపాయిజన్ దెబ్బతో ప్రియుడు ?
అదే రోజు షారోన్ అతని స్నేహితుడితో కలిసి ప్రియురాలు గిరిష్మా ఇంటికి వెళ్లాడు. తరువాత గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్ కు ఇచ్చింది. జ్యూస్ తాగిన షారోన్ వాంతులు చేసుకుని కడుపునోప్పితో తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స విఫలమై షారోన్ చనిపోయాడు.
మ్యాటర్ లీక్ చేసిన షారోన్ ఫ్రెండ్
షారోన్ స్నేహితుడు జరిగిన మ్యాటర్ మొత్తం షారోన్ తండ్రి జయరామన్ కు చెప్పాడు. షారోన్ తండ్రి జయరామన్ ఫిర్యాదు చెయ్యడంతో కేరళ పోలీసులు గిరిష్మా మీద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో గిరిష్మా ఆమె ప్రియుడు షారోన్ కు స్లోపాయిజన్ ఇచ్చి హత్య చేశానని అంగీకరించింది.
పోలీసులను తికమకపెట్టిన ప్రియురాలు
పెళ్లి విషయంలో నేను అడ్డం తిరిగానని, అయితే షారోన్ మాత్రం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశానని గిరిష్మా పోలీసుల విచారణలో చెప్పిందని వెలుగు చూసింది. స్లోపాయిజన్ తో తన ప్రియుడు షారోన్ ను ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంలో గిరిష్మా రెండుమూడు కోణాల్లో చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారని తెలిసింది.
జ్యోతిష్యుడు చెప్పినందుకు కాదు ?
జ్యోతిష్యుడి మాటలు నమ్మి తన ప్రియుడు షారోన్ ను తాను హత్య చెయ్యలేదని గిరిష్మా చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తన ప్రియుడు నేను చెప్పిన మాట వినలేదని, గతంలో తాము ఇద్దరూ కలిసి తిరిగిన సమయంలో, సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు షారోన్ అతని మొబైల్ ఫోన్ లో డిలీట్ చెయ్యడానికి అంగీకరించలేదని, అదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని, అందుకే హత్య చేశానని గిరిష్మా పోలీసులకు చెప్పిందని తెలిసింది.
ప్రియురాలి ఇంటి మీద దాడి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు షారోన్ ను నమ్మించి ఇంటికి పిలిపించి జ్యూస్ లో విషం కలిపి హత్య చేసిన గిరిష్మా ఇంటి మీద స్థానికులు దాడి చెయ్యడం కలకలం రేపింది. గిరిష్మా ఇంటి మీద దాడి చేసి కిటికీలు, తలుపులు, ఇంటిలో ఫర్నీచర్ ధ్వంసం చెయ్యడం పోలీసులు జ్యోక్యం చేసుకుని స్థానికులకు సర్దిచెప్పారు. నమ్మించి హత్యలు చేసే గిరిష్మా, ఆమె కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండకూడదని స్థానికులు డిమాండ్ చేశారు. గిరిష్మా ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.