Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: నిలువునా ముంచేసిన ప్రియురాలు, నిశ్చితార్థం, వీడియో తీసి ఉరి వేసుకున్న జిమ్ ట్రైనర్ !

బెంగళూరు: జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు చూడటానికి పొడవుగా, కండలు పెంచి అందంగానే ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం జిమ్ ట్రైనర్ కు ఓ యువతి పరిచయం అయ్యింది. తరువాత ఆ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు సంతోషంగా తిరిగారు. మొదట మనం వివాహం చేసుకుందామని ఆ యువతి ఆమె ప్రియుడికి ప్రపోజ్ చేసిందని తెలిసింది. మంచి రోజు చూసి పెళ్లి చేసుకోవడానికి యువకుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జిమ్ ట్రైనర్ గా మంచి జీతం తీసుకుంటున్న యువకుడు పెళ్లి చేసుకున్నా భార్యను పోషించుకుంటాననే అనే ధైర్యం అతనికి ఉండేది. అయితే కొంతకాలం క్రితం ప్రియుడికి హ్యాండ్ ఇచ్చేసిన ప్రియురాలు జెండా ఎత్తేసింది. ప్రియురాలు దూరం అయ్యిందని జిమ్ ట్రైనర్ అతని స్నేహితుల దగ్గర ఆవేదన చెందాడు. యువకుడికి పెళ్లి ఫిక్స్ చేసి తాంబూళాలు మార్చుకోవడానికి అతని కుటుంబ సభ్యులు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. ఉదయం నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్లవలసిన యువకుడు అంతకు ముందు రోజు రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువకుడు అతని మొబైల్ ఫోన్ లో అతని ప్రియురాలు అతన్ని ఎలా మోసం చేసింది అంటూ పిన్ పిన్ చెప్పి రికార్డు చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 బెంగళూరులో ఫేమస్ జిమ్ సెంటర్ లో ట్రైనర్

బెంగళూరులో ఫేమస్ జిమ్ సెంటర్ లో ట్రైనర్

బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని మారప్ప లేఔట్ లో కార్తీక్ అలియాస్ కార్తీ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉండే ఆర్ఆర్ నగర్ లోని ఓ జిమ్ సెంటర్ లో కార్తీక్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్న కార్తీక్ కు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.

 మూడు ఏళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు

మూడు ఏళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు

జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్న కార్తీక్ చూడటానికి పొడవుగా, కండలు పెంచి అందంగానే ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం జిమ్ ట్రైనర్ కార్తీక్ కు బెంగళూరులోనే నివాసం ఉంటున్న ఓ యువతి పరిచయం అయ్యింది. తరువాత ఆ యువతి, కార్తీక్ ప్రేమించుకున్నారు. అందరి ప్రేమికులు లాగానే కార్తీక్ అతని ప్రియురాలితో సంతోషంగా తిరిగారు.

 పెళ్లి చేసుకుందామని ఫస్ట్ ప్రియురాలు చెప్పింది

పెళ్లి చేసుకుందామని ఫస్ట్ ప్రియురాలు చెప్పింది

మొదట మనం వివాహం చేసుకుందామని ఆ యువతి ఆమె ప్రియుడు కార్తీక్ కు ప్రపోజ్ చేసిందని తెలిసింది. మంచి రోజు చూసి పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ అతని ప్రియురాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పర్వాలేదని, జిమ్ ట్రైనర్ గా మంచి జీతం తీసుకుంటున్న నేను పెళ్లి చేసుకున్నా నా భార్యను పోషించుకుంటాననే అనే ధైర్యం కార్తీక్ కు ఉండేది.

 హ్యాండ్ ఇచ్చి జెండా ఎత్తేసిన ప్రియురాలు

హ్యాండ్ ఇచ్చి జెండా ఎత్తేసిన ప్రియురాలు

ఏడాది క్రితం కార్తీక్ ప్రియురాలిలో మార్పులు వచ్చాయి. రానురాను ఆమె కార్తీక్ కు దూరం అవుతూ వచ్చింది. కొంతకాలం క్రితం ప్రియుడు కార్తీక్ కు హ్యాండ్ ఇచ్చేసిన ప్రియురాలు జెండా ఎత్తేసింది. ప్రియురాలు దూరం అయ్యిందని జిమ్ ట్రైనర్ కార్తీక్ అతని స్నేహితుల దగ్గర ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రియురాలిని సొంతం చేసుకోవాలని కార్తీక్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడని తెలిసింది.

 పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు

పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు

కార్తీక్ ప్రియురాలు దూరం కావడంతో వేరే అమ్మాయితో అతని పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. కార్తీక్ కోసం మంచి అమ్మాయిని చూసిన అతని కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. తాంబూళాలు మార్చుకోవడానికి కార్తీక్ కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం బయలుదేరడానికి సిద్దం అయ్యారు.

Recommended Video

    Deepak Chahar Love Story ప్రపోజ్ వెనుక MS Dhoni మాస్టర్ మైండ్ | Who is Jaya Bhardwaj?|| Oneindia
     వీడియో తీసి ఉరి వేసుకున్న భగ్న ప్రేమికుడు

    వీడియో తీసి ఉరి వేసుకున్న భగ్న ప్రేమికుడు

    వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్లవలసిన కార్తీక్ అంతకు ముందు రోజు రాత్రి ఇంట్లో అతని రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు కార్తీక్ అతని మొబైల్ ఫోన్ లో అతని ప్రియురాలు అతన్ని ఎలా మోసం చేసింది అంటూ పిన్ పిన్ చెప్పి రికార్డు చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కార్తీక్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని వీడియో ఆధారంగా విచారణ చేస్తున్నారు. కార్తీక్ ప్రియురాలి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. కార్తీక్ ఆత్మహత్యకు అతని మాజీ ప్రియురాలు కారణం అని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+