Girlfriend: కంప్యూటర్ సెంటర్ లో క్యాబిన్స్ ఎక్కువే, ప్రియురాలిని గోకాడని, ఫినిష్ !
బెంగళూరు/ కేజీఎఫ్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువతి ఉద్యోగం చేస్తూ ప్రియుడి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తూ వస్తోంది. యువతి ఉద్యోగం చేస్తున్న కంప్యూటర్ సెంటర్, సైబర్ కేఫ్ సెంటర్ యజమాని కూడా ఆ అమ్మాయి మీద కన్ను వేశాడు. అసలే సైబర్ కేఫ్ లో క్యాబిన్ లు ఎక్కువగా ఉండటంతో దాని యజమాని అమ్మాయితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగింది. నా లవర్ తో నీకు ముచ్చట్లు ఏందిరా ముటాల్ అంటూ ప్రియుడు ఆ కంప్యూటర్ సెంటర్ యజమానిని యుముడి దగ్గరకు పంపించేశాడు.

ఫేమస్ లవర్స్
ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణంలో రాజేంద్రప్రసాద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కేజీఎఫ్ లోనే నివాసం ఉంటున్న చైత్రా (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయి, రాజేంద్రప్రసాద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, చైత్రా లవ్ స్టోరీ వారి ఫ్రెండ్స్ అందరికి తెలుసు.

కేజీఎఫ్ అంటేనే క్రేజ్
ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణం పేరుకు కోలారు జిల్లాలో ఉన్నా అది ఓ ప్రత్యేకమైన పట్టణంగా గుర్తింపు తెచ్చుకునింది. అంధ్రప్రదేశ్ సరిహద్దు కావడంతో అక్కడ తెలుగు మాట్లాడతారు. ఇక కర్ణాటకలో కేజీఎఫ్ ఉండటంతో అక్కడ అధికారికంగా కన్నడ బాష మాట్లాడతారు. అయితే కేజీఎఫ్ కర్ణాటకలో ఉన్నా అక్కడ దాదాపు 70 శాతం మంది ఎక్కువగా మాట్లాడే బాష మాత్రం తమిళ్. కేజీఎఫ్ లో ఎక్కువగా తమిళ తంబీలు నివాసం ఉంటున్నారు. తమిళ వ్యక్తులు కేజీఎఫ్ లో ఎమ్మెల్యేలు అయ్యారు.

ప్రియుడి చేతి ఖర్చులకు డబ్బులు
కేజీఎఫ్ లో ముకుందన్ (తమిళ్ తంబి) అనే వ్యక్తి కంప్యూటర్ సెంటర్, సైబర్ కేఫ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రాజేంద్రప్రదసాద్ ప్రియురాలు చైత్రా ఇదే కంప్యూటర్ సెంటర్ లో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తున్న చైత్రా వచ్చే జీతంలో కొంత డబ్బులును ప్రియుడు రాజేంద్రప్రసాద్ చేతి ఖర్చులకు ఇచ్చేదని సమాచారం.

కంప్యూటర్ సెంటర్ లో క్యాబిన్లు ఎక్కవే
కంప్యూటర్ సెంటర్ లో సైబర్ కేఫ్ ఉండటంతో స్థానికంగా నివాసం ఉంటున్న యువతి, యువకులు అక్కడ ఇంటర్నెట్ లో, కంప్యూటర్ లో వారి వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఎక్కువగా వెలుతున్నారు. ముకుందన్ నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్ లో క్యాబిన్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

చేతికి పని చెప్పిన కంప్యూటర్ సెంటర్ ఓనర్
తన దగ్గర ఉద్యోగం చేస్తున్న చైత్రాకు ఓ ప్రియుడు ఉన్నాడని కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ కు ముందే తెలుసు అని సమాచారం. అయితే తన దగ్గర ఉద్యోగం చేస్తున్న చైత్రా మీద ముకుందన్ మోజు పడ్డాడు. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించిన ముకుందన్ ఆమెతో రాసుకుని పూసుకుని తిరిగాడని తెలిసింది.

ఉద్యోగానికి సీటీమార్
తనను పెళ్లి చేసుకోవాలని, కంప్యూటర్ సెంటర్ మొత్తం నీకే ఇచ్చేస్తానని ముకుందన్ చైత్రా మీద ఒత్తిడి చేశాడని తెలిసింది. ఉద్యోగానికి వెలుతున్న తన ప్రియురాలు చైత్రాతో ముకుందన్ ముచ్చట్లు ఆడుతున్నాడని ప్రియుడు రాజేంద్రప్రసాద్ కు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో ప్రియుడితో గొడవపడిన చైత్రా ఎక్కడ వచ్చిన రామాయణం అంటూ కంప్యూటర్ సెంటర్ లో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నది.

పక్కా స్కెచ్ తో లేపేసిన ప్రియుడు
చైత్రా ఉద్యోగం మానేసినా కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ నిత్యం ఆమెతో ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడని ప్రియుడు రాజేంద్రప్రసాద్ కు తెలిసింది. ఇదే విషయంలో ప్రియుడు రాజేంద్రప్రసాద్ రగిలిపోయాడు. ఏప్రిల్ 28వ తేదీన రాత్రి కంప్యూటర్ సెంటర్ మూసి వేసిప ముకుందన్ బైక్ లో ఊరి బయటకు వెళ్లాడు. అదే సమయంలో ప్రియుడు రాజేంద్రన్, అతని స్నేహితుడు మేల్విన్ లు కలిసి పక్కాప్లాన్ తో ముకుందన్ ను చంపేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ప్రియుడు రాజేంద్రప్రసాద్, అతని స్నేహితుడు మేల్విన్ ను అరెస్టు చేశారు. అమ్మాయి కోసం కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ హత్యకు గురికావడంతో కేజీఎఫ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications