ప్రియురాలికి పెళ్లి కుదిరిందని ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రియుడు ఏం చేశాడంటే..
ఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి కుదరడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ప్రాణం తీసుకున్నాడు. నాలుగు పేజీల సూసైడ్ లెటర్ రాసి, ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి ఉరి వేసుకున్నాడు. ఆగ్రాలోని రాయ్‌భా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం
రాయ్‌భా గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్యాం అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతనికి ఉద్యోగం లేకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నాడు. అయితే ఈ లోపు అతని ప్రియురాలికి వేరే సంబంధం కుదిరింది. ఆమె కుటుంబసభ్యులు అమ్మాయికి నిశ్చితార్థం చేశారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి జరగబోతోందన్న విషయం తెలుసుకున్న శ్యాం డిప్రెషన్‌కు లోనయ్యాడు. ప్రియురాలు దూరమవుతోందన్న బాధతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

గుడిలో ఉరేసుకుని ఆత్మహత్య
శనివారం ఊరిలోని గుడి వద్దకు వెళ్లిన శ్యాం ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశాడు. తాను చనిపోతున్నట్లు వీడియోలో చెప్పాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో శ్యాం ఆత్మహత్య దృశ్యాలను చూసిన కుటుంబసభ్యులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. అతన్ని ఆపేందుకు గుడి దగ్గరకు వెళ్లేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉరి వేసుకున్న శ్యాం అప్పటికే ప్రాణాలు వదిలాడు.

అవయవదానం చేయాలని విజ్ఞప్తి
ఆత్మహత్యకు ముందు శ్యాం నాలుగు పేజీల లేఖ రాశాడు. అందులో కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరిన యువకుడు తన అవయవాలు దానం చేయాలని విజ్ఞప్తి చేశాడు. నాలుగు నిమిషాల పాటు లైవ్ వీడియోలో తన మరణానికి ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని దింపి పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్యాం మృతితో అతని తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బంధువులు అతని ఫేస్‌బుక్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications