Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: కాలేజ్ క్యాంపస్ లో యువతి గొంతు కోసి చంపేశాడు, ప్రాణం పోతుంటే నవ్వుతూ చూసిన సైకో !

కొచ్చి/ కొట్టాయం/ చెన్నై: ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యాయింది. ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది. చాలాకాలం నుంచి యువతి, యువకుడు కలిసి తిరిగారని సమాచారం. యువకుడు మాత్రం ఆమెను ప్రేమించాడు. అయితే యువతి అతనితో స్నేహితురాలిగానే ఉందని తెలిసింది. కొంతకాలం ఇద్దరి మద్య తేడాలు రావడంతో ఆ యువతి అతనితో అంటిముట్టనట్లు వ్యవహరించిందని తెలిసింది. కరోనా వైరస్ కారణంగా కాలేజ్ మూసివేయడంతో ఇంట్లో ఆన్ లైన్ క్లాసులకు హాజరౌతున్న ఆ యువతి ఆ యువకుడిని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. తాను ఫోన్ చేసినా యువతి మాట్లాడలేదని అతను కక్ష పెంచుకున్నాడు. కాలేజ్ లో పరీక్షలు రాయడానికి ఆ యువతి కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చింది. కాలేజ్ క్యాంపస్ లో ఆమెతో ఆ యువకుడు మాట్లాడాడు. అక్కడ ఇద్దిర మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో కత్తితో ఆ యువతి గొంతు కోసేశాడు. గొంతు పూర్తిగా తెగిపోవడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. సంఘటనా స్థలంలో యువతి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్న సమయంలో పక్కనే నిలబడి నవ్వుతూ చూసిన ఆ రాక్షసుడు ఆమె ప్రాణాలు వదులుతున్న సమయంలో సైకోలాగా ప్రవర్తించాడు. యువతిని చంపేసిన యువకుడు పోలీసులు వచ్చే వరకు అక్కడే ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉండటం కలకలం రేపింది.

 కాలేజ్ ఫ్రెండ్స్

కాలేజ్ ఫ్రెండ్స్

కేరళలోని కొట్టాయంలోని సెయింట్ థామస్ కాలేజ్ లో అభిషేక్ బైజు, నితినా మోల్ (22) అనే అమ్మాయి చదువుకుంటున్నారు. ఒకే కాలేజ్ లో చదువుతున్న నితినా మోల్ అనే యువతి, అభిషేక్ అనే యువకుడికి పరిచయం అయ్యాయింది. నితినా మోల్, అభిషేక్ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ స్నేహితులుగానే తిరిగారు.

 అభిషేక్ వన్ సైడ్ లవ్

అభిషేక్ వన్ సైడ్ లవ్

చాలాకాలం నుంచి నితినా, అభిషేక్ కలిసి తిరిగారని సమాచారం. అభిషేక్ మాత్రం నితినాను ప్రేమించాడు. అయితే నితినా మాత్రం అభిషేక్ తో స్నేహితురాలిగానే ఉందని తెలిసింది. కొంతకాలం నితిన్, అభిషేక్ మద్య తేడాలు రావడంతో ఆ యువతి అతనితో అంటిముట్టనట్లు వ్యవహరించిందని తెలిసింది.

 ఆన్ లైన్ క్లాసులతో పూర్తిగా కట్

ఆన్ లైన్ క్లాసులతో పూర్తిగా కట్

కరోనా వైరస్ కారణంగా కాలేజ్ మూసివేయడంతో అభిషేక్, నితినా ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులకు హాజరౌతున్నారు. ఇంటికే పరిమితం అయిన నితినా ఆమె స్నేహితుడు అభిషేక్ ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. తాను ఎన్నిసార్లు పదేపదే ఫోన్ చేసినా నితినా నాతో మాట్లాడలేదని అభిషేక్ కొంతకాలంగా కక్ష పెంచుకున్నాడు.

కాలేజ్ క్యాంపస్ లో గొడవ పెట్టుకున్న భాయ్ ఫ్రెండ్

కాలేజ్ క్యాంపస్ లో గొడవ పెట్టుకున్న భాయ్ ఫ్రెండ్

కాలేజ్ లో పరీక్షలు రాయడానికి నితినా మోల్ సెయింట్ థామస్ కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చింది. కాలేజ్ క్యాంపస్ లో నితినాను అడ్డగించిన అభిషేక్ ఆమెతో మాట్లాడాడు. తాను పరీక్షలు రాయడానికి వచ్చానని, నీతో సొల్లు కబుర్లు చెప్పడానికి రాలేదని, దయచేసి నన్ను వదిలేయాలని నితినా ఆమె మాజీ స్నేహితుడు అభిషేక్ కు తేల్చి చెప్పింది. ఆ సమయంలో అక్కడ అభిషేక్, నితినా మద్య మాటామాటా పెరిగిపోయింది.

 గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసేసిన శాడిస్టు

గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసేసిన శాడిస్టు

మాటామాటా పెరిగిపోయిన సమయంలో అభిషేక్ వెంట తీసుకెళ్లిన కత్తితో నితినా గొంతు కోసేశాడు. గొంతు పూర్తిగా తెగిపోవడంతో నితినా కాలేజ్ క్యాంపస్ లోనే అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షలు రాయడానికి వచ్చిన సాటి విద్యార్థులు భయంతో కాలేజ్ క్యాంపస్ లో పరుగు తీశారు. అభిషేక్ చేతిలో పదునైన కత్తి ఉండటంతో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న నితినాను రక్షించడానికి కొన్ని నిమిషాలు ఎవ్వరూ ధైర్యం చెయ్యలేదని తెలిసింది.

 గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంటే నవ్వుతూ చూసిన సైకో

గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంటే నవ్వుతూ చూసిన సైకో

కాలేజ్ క్యాంపస్ లోనే సంఘటనా స్థలంలో నితినా గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్న సమయంలో అభిషేక్ ఆమె పక్కనే నిలబడి నవ్వుతూ చూశాడు. నితినా ప్రాణాలు వదులుతుంటే రాక్షసుడు అభిషేక్ సైకోలాగా ప్రవర్తించాడని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు. హడలిపోయిన కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 గతంలో ఫ్రెండ్స్ గానే తిరిగారు

గతంలో ఫ్రెండ్స్ గానే తిరిగారు

గతంలో అభిషేక్, నితినా స్నేహితులుగా కలిసిమెలసి తిరిగారని కొట్టాయం జిల్లా ఎస్పీ శిల్పా మీడియాకు చెప్పారు. అభిషేక్ చాలాసేపు నితినా వాదించాడని, తరువాత అకస్మాత్తుగా కత్తి తీసుకుని ఆమె గొంతు కోసేశాడని సెయింట్ థామస్ కాలేజ్ సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారని కేరళ మీడియా అంటోంది.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
     విచారం వ్యక్తం చేసిన మంత్రి

    విచారం వ్యక్తం చేసిన మంత్రి

    పేపర్ కట్టర్ తో అభిషేక్ అతని మాజీ స్నేహితురాలి గొంతు కోసేశాడని, అతన్ని అరెస్టు చేసే సమయంలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉన్నాడని కొట్టాయం ఎస్పీ శిల్పా మీడియాకు చెప్పారు. నితినాను అభిషేక్ దారుణంగా హత్య చేశాడని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని కేరళ మంత్రి వీఎస్. వాసవన్ అన్నారు. తమ కూతురు నితినా మోల్ ఉన్నత చదువులు చదవాలని ఆశపడిన ఆమె తల్లి ఆశయాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+