అక్రమ సంబంధం, ఆంటీ ఇంటికి వెళ్లిన ప్రియుడి హత్య, రాత్రి ఏం జరిగిందంటే !
చెన్నై/హోసూరు: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తి భర్త చనిపోయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కొడుకులు పెళ్లి వయసుకు వచ్చారు. ఇదే సమయంలో ప్రియురాలితో రొమాన్స్ చెయ్యడానికి వెళ్లిన వ్యక్తి ఆంటీ ఇంటిలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు పక్కనే ఉన్న కోలదాసపురం గ్రామంలో జ్యోతి(42) అనే మహిళ నివాసం ఉంటున్నది. జ్యోతి. భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జ్యోతి స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. మహదేవపురానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్ (40) అతని భార్యతో అభిప్రాయభేదాలు రావడంతో అతను భార్యతో విడిగా ఉంటున్నాడు.

డ్రైవర్ వెంకటేష్, అంగన్ వాడి టీచర్ జ్యోతికి పరిచయం కావడంతో రానురాను ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా వెంకటేష్, జ్యోతి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఇద్దరూ తరచుగా ఒకరినొకరు కలుసుకుని ఏకాంతంగా రొమాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వెంకటేష్ అతని ప్రియురాలు జ్యోతి ఇంటికి వెళ్లాడు. వెంకటేష్ వెళ్లిన కొద్దిసేపటికే జ్యోతి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున అరుపులు వినిపించాయి.
శబ్దం విని ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసే సరికి వెంకటేష్ తీవ్రగాయాలతో రక్తమోడుతూ ఇంటిలో కనిపించాడు. స్థానికులు వెంటనే వెంకటేష్ ను రక్షించి చికిత్స నిమిత్తం హోసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై వెంకటేష్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి సీరియస్‌గా విచారణ చేపట్టారు.

విచారణలో జ్యోతి, వెంకటేష్ గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని వెలుగు చూసింది. ఇటీవల జ్యోతి ఆమె ప్రియుడు వెంకటేష్‌ను కలవడం, అతనితో మాట్లాడటం తగ్గించుకుందని తెలిసింది. తల్లి జ్యోతి అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో జ్యోతి చిన్న కుమారుడు హరీష్ తల్లి ప్రియుడు వెంకటేష్ కు వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. ఇక నుంచి తన ఇంటికి రావద్దని జ్యోతి ఆమె ప్రియుడు వెంకటేష్‌కి చెప్పింది.
ఈ క్రమంలో వెంకటేష్ తిరిగి జ్యోతి ఇంటికి వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన జ్యోతి చిన్న కొడుకు హరీష్ తల్లి ప్రియుడు వెంకటేష్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో జ్యోతి, హరీష్‌లు ఇనుప రాడ్, కర్రలతో వెంకటేష్‌పై తీవ్రంగా దాడి చేశారు. వెంకటేష్ అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. స్థానికులు రావడం చూసిన జ్యోతి, ఆమె కుమారుడు హరీష్ వెనుక డోర్ నుంచి పారిపోయారు.

ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించి వెంకటేష్‌ను హోసూరు ఆసుపత్రికి తరలించినా అతను చికిత్స అందక మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు జ్యోతి, హరీష్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియురాలు జ్యోతి తన ఇంటికి రాకూడదు అని చెప్పినా ఆమె మాట వినకుండా వెళ్లిన వెంకటేష్ హత్యకు గురైనాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications