Girlfriend: హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, కాభోయే భార్య నగ్న ఫోటోలు ? ఐడీ, పాస్వర్డ్ తో ప్లాన్ !
అహమ్మదాబాద్/చెన్నై: ప్రియురాలితో చనువుగా ఉన్న సమయంలో ప్రియుడు ఆమెకు అతని సోషల్ మీడియా అకౌంట్ ఐడీ, పాస్వర్డ్ లు ఇవ్వడంతో ఇప్పుడు అతని కొపం మునిగింది. యువతి, యువకుడు ప్రేమించుకుని చట్టాపట్టాలు వేసుకుని హ్యాపీగా తిరిగారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు అతని ప్రియురాలితో కలిసి పార్కులు, సినిమాలు, షికార్లు, రిసార్టులకు తిరిగి ఆమెతో ఎంజాయ్ చేశాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన ప్రియురాలు అతనికి సర్వంసమర్పయామి అంటూ అన్ని సమర్పించుకుంది.
ప్రియురాలి మీద మోజు తీరిపోయిన తరువాత ప్రియుడు వేరే యువతితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్దం అయ్యాడు. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు రగిలిపోయింది. అంతే ప్రియురాలి మాస్టర్ మైండ్ తో ఓ స్కెచ్ వేసింది. ప్రియుడికి కాబోయే భార్య నగ్న ఫోటోలు సేకరించిన అతని ప్రియురాలు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

ఒకే సిటీలో లవర్స్
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అహమ్మదాబాద్ లోనే నివాసం ఉంటున్న 22 ఏళ్ల రష్మి (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ప్రేమించాడు. రష్మీకూడా రాకేష్ ను గుడ్డిగా నమ్మి అతని ప్రేమ మైకంలో పడిపోయింది.

ఎంజాయ్ చేసిన ప్రేమికులు
రాకేష్, రష్మీ ప్రేమించుకుని చట్టాపట్టాలు వేసుకుని హ్యాపీగా తిరిగారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు రాకేష్ అతని ప్రియురాలు రష్మీతో కలిసి పార్కులు, సినిమాలు, షికార్లు, రిసార్టులకు తిరిగి ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. ప్రియుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రియురాలు రష్మీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా అతని వెంట వెళ్లిపోయింది.

సర్వం సమర్పయామి
ప్రియుడు రాకేష్ పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన ప్రియురాలు రష్మీ అతనికి సర్వంసమర్పయామి అంటూ అన్ని సమర్పించుకుంది. ప్రియురాలు రష్మీ మీద మోజు తీరిపోయిన తరువాత ప్రియుడు రాకేష్ వేరే యువతిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. రానురాను రష్మీకి ఆమె ప్రియుడు రాకేష్ దూరం కావడం మొదలుపెట్టాడు.

ప్రియుడి సీక్రెట్ నిశ్చితార్థం
రష్మీకి తెలీకుండా రాకేష్ వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రియుడు రాకేష్ తీరులో మార్పులు రావడంతో రష్మీకి అనుమానం వచ్చింది. ఇదే సమయంలో ప్రియుడు రాకేష్ సోషల్ మీడియా అకౌంట్ లో అతని నిశ్చితార్థం ఫోటోలను రష్మీ చూసింది. ఇదే సమయంలో కాభోయే భార్య రాకేష్ కు ఆమె నగ్న ఫోటోలు షేర్ చేసిన విషయం రష్మీ కంట్లో పడింది. అంతే అక్కడ రష్మీకి మంచి చాన్స్ చిక్కినట్లు అయ్యింది.

ఆరోజుల్లో సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్ లు ఇచ్చిన ప్రియుడు
రష్మీతో జల్సా చేస్తున్న సమయంలో ఆమెకు రాకేష్ అతని సోషల్ మీడియాలో అకౌంట్ ఐడీలు, పాస్వర్డ్ లు ఇచ్చాడు. ఇప్పుడు అదే అకౌట్ ఐడీలు, పాస్వర్డ్ లు తెలుసుకున్న రష్మీ అతనికి బుద్దిచెప్పాలని డిసైడ్ అయ్యింది. రాకేష్ కు కాబోయే భార్యకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టు పంపించింది. అలా రాకేష్ కు కాభోయే భార్యతో రష్మి పరిచయం పెంచుకుంది.

పెళ్లికి ముందే పరువు తీసేసింది
రాకేష్ మీద పగతో అతనికి కాభోయే భార్య నగ్న ఫోటోలు సేకరించిన రష్మీ వాటిని రాకేష్ సోషల్ మీడియాలో అకౌంట్ లు ఉపయోగించి పబ్లిక్ గా అందరికి షేర్ చేసేసింది. తరువాత పోర్న్ సైట్ లో ఆ అమ్మాయి ఫోటోలు అప్ లోడ్ చేసేసింది. కాభోయే భార్య నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో రాకేష్ తో పాటు బంధువులు షాక్ అయ్యారు. రాకేష్ మీద పగతో రష్మీ చేసిన పనితో కలకలం రేపింది.

మాజీ ప్రియురాలు అందర్
రాకేష్ ను అతనికి కాభోయే భార్య నిలదీసి ఏమిటి ఇది అని ప్రశ్నించింది. చివరికి రాకేష్ కు అతని మాజీ ప్రియురాలు రష్మీ మీద అనుమానం వచ్చింది. రాకేష్ అతనికి కాభోయే భార్యతో అహమ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రాకేష్ మాజీ ప్రియురాలు రష్మీని అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడి మీద పగతో మరో అమ్మాయి జీవితం ?
తన మాజీ ప్రియుడు రాకేష్ మీద పగ తీర్చుకోవడానికి తానే అతనికి కాభోయే భార్య ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశానని రష్మీ అంగీకరించిందని, కేసు విచారణలో ఉందని అహమ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద ప్రియుడి మీద పగతో అతని మాజీ ప్రియురాలు చేసిన పనికి ఓ అమ్మాయి జీవితం రోడ్డునపడిందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications