Girlfriend: సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్, అపార్ట్ మెంట్ లో ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, మద్యం తాగించి !

తిరువనంతపురం/ తిరుపతి: టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. టిక్ టాక్ వీడియోలు బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో యువతి, యువకుడు టచ్ లో ఉన్నారు. ఇద్దరూ నివాసం ఉంటున్న ప్రాంతాలు చాలా దూరం ఉండటంతో చాలా కాలం సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ గా ఉంటూ చాలా సన్నిహితంగా దగ్గర అయ్యారు. నిన్ను చూడాలని ఉందని ఆ యువకుడు టిక్ టాక్ ఫేమ్ అయిన యువతికి మాయమాటలు చెప్పాడు. బాయ్ ఫ్రెండ్ కోసం ఆ యువతి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. యువకుడు చెప్పిన అపార్ట్ మెంట్ కు వెళ్లిన ఆ యువతి అతనితో కేవలం రెండు గంట సేపు మాత్రం సంతోషంగా ఉందని సమాచారం. తరువాత యువకుడి ఫ్రెండ్స్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ లిక్కర్ పార్టీ జరిగింది. యువతితో బలవంతంగా మద్యం తాగించిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె మీద అత్యాచారం చేశాడు. బాయ్ ఫ్రెండ్ తో పాటు అతన్ని స్నేహితులు గ్యాంగ్ రేప్ చెయ్యడంతో మద్యం మత్తులో ఉన్న యువతి స్పృహ కోల్పోయింది. కారులో స్పృహలో లేని యువతిని ఎత్తుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన పడేసిన కామాంధులు పరారైనారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. బాధితురాలు సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడి ఫోటో, ఫోన్ నెంబర్ ను పోలీసులకు ఇచ్చింది. యువతి కోలుకున్న తరువాత పూర్తి సమాచారం సేకరిస్తామని కేరళలోని కోజికోడ్ పోలీసులు అంటున్నారు.

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్


కేరళలోని కొల్లాంకు చెందిన 28 ఏళ్ల వయసు ఉన్న లిజి (పేరు మార్చడం జరిగింది) టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. మలయాళి ప్రజలకు దగ్గర అయిన లిజి చాలా మందిలో గుర్తింపు తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియోలు బ్యాన్ చేసిన తరువాత లిజి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది.

సోషల్ మీడియా ఫ్రెండ్

సోషల్ మీడియా ఫ్రెండ్


కోజికోడ్ కు చెందిన అనాస్ అనే యువకుడు లిజికి పరిచయం అయ్యాడు. టిక్ టాక్ వీడియోలు బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో లిజి, కోజీకోడ్ యువకుడు అనాస్ నిత్యం టచ్ లో ఉన్నారు. అనాస్ కోజీకోడ్ లో ఉండటం, లిజి కొల్లాంలో నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న ప్రాంతాలు చాలా దూరం ఉండటంతో చాలా కాలం లిజి, అనాస్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ గా ఉంటూ చాలా సన్నిహితంగా దగ్గర అయ్యారు.

మాయమాటలు చెప్పిన బాయ్ ఫ్రెండ్

మాయమాటలు చెప్పిన బాయ్ ఫ్రెండ్

నిన్ను చూడాలని ఉందని, మనం కలిసి మనసు విప్పి మాట్లాడుకోవాలని అనాస్ టిక్ టాక్ తో ఫేమస్ అయిన లిజికి మాయమాటలు చెప్పాడు. బాయ్ ఫ్రెండ్ అనాస్ ను కలవాలని లిజి కూడా సిద్దం అయ్యింది. కేరళలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నా లెక్కచెయ్యకుండా లిజి కొల్లాం నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోజీకోడ్ చేరుకుని అనాస్ చెప్పిన అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లింది.

ఫ్రెండ్స్ ఎంట్రీతో లిక్కర్ పార్టీ

ఫ్రెండ్స్ ఎంట్రీతో లిక్కర్ పార్టీ


అపార్ట్ మెంట్ లో కేవలం రెండు గంటల సేపు మాత్రమే అనాస్ తో లిజి సంతోషంగా ఉందని సమాచారం. తరువాత అనాస్ ముగ్గురు ఫ్రెండ్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఆపార్ట్ మెంట్ లో లిక్కర్ పార్టీ జరిగింది. లిజితో బలవంతంగా మద్యం తాగించడంతో ఆమె మత్తులోకి జారుకుంది. తరువాత లిజి మీద ఆమె సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ అనాస్ అత్యాచారం చేశాడు. బాయ్ ఫ్రెండ్ అనాస్ తరువాత అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చెయ్యడంతో మద్యం మత్తులో ఉన్న లిజి అపార్ట్ మెంట్ లో స్పృహ కోల్పోయింది.

రోడ్డు పక్కన యువతిని విసిరేసి ఎస్కేప్

రోడ్డు పక్కన యువతిని విసిరేసి ఎస్కేప్

స్పృహలో లేని లిజిని ఎత్తుకుని కారులో వేసుకున్న నిందితులు రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన ఆమెను పడేసిన కామాంధులు వచ్చిన కారులోనే పరారైనారు. విషయం గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల చేతిలో కామాంధుడి ఫోటో, ఫోన్ నెంబర్

పోలీసుల చేతిలో కామాంధుడి ఫోటో, ఫోన్ నెంబర్

ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. బాధితురాలు లిజి సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడు అనాస్ ఫోటో, అతని ఫోన్ నెంబర్ ను పోలీసులకు ఇచ్చింది. యువతి కోలుకున్న తరువాత పూర్తి సమాచారం సేకరిస్తామని కేరళలోని కోజికోడ్ పోలీసులు అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్రెండ్ అనాస్ తో పాటు మరో కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. సోషల్ మీడియా ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్లు ప్రయాణించిన యువతి గ్యాంగ్ రేప్ కు గురి కావడం కేరళలో కలకలం రేపింది. యవతి మీద రేప్ చేసిన కామాంధుడు తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ పారిపోయాడని సమాచారం. యువతి బాయ్ ఫ్రెండ్ అనాస్ చాలాకాలం నుంచి పక్కా స్కెచ్ ప్రకారంతోనే ఆమెను అపార్ట్ మెంట్ కు పిలిపించుకున్నాడు. ఆమె వస్తున్నదని తెలిసి ముందుగానే లిక్కర్ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి సంఘటన వెలుగు చూడకముందు కూడా ఇంటి సంఘటనలకు ఏమైనా పాల్పాడ్డారా అంటూ అనాస్ అండ్ గ్యాంగ్ గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+