Girlfriends: ఒకేసారి ఇంటి ముందు కారులో దిగిన నలుగురు గర్ల్ ఫ్రెండ్స్, బిత్తరపోయిన బాయ్ ఫ్రెండ్ !
కోల్ కత్తా: యవ్వనంలో ఉన్న యువకుడు ఓ అమ్మాయి వెంటపడటం మొదలు పెట్టాడు. మొదటిసారి అమ్మాయిని వలలో వేసుకోవడానికి అతను నానా ఇబ్బందులు పడ్డాడు. నిన్ను ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి వెంట తిరిగిన ఆ యువకుడు చివరికి ఆమెను లొంగదీసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు. మొదటి అమ్మాయి వలలో పడిన తరువాత ఆమెతో ఎంజాయ్ చేస్తున్న యువకుడు మరో యువతి వెంటపడ్డాడు. నువ్వు అంటే నాకు ఇష్టం అని, మనం పెళ్లి చేసుకుందామని ఆమెకు మాయమాటలు చెప్పాడు. రెండో అమ్మాయి వలలో పడిపోయిన తరువాత మరో ఇద్దరు అమ్మాయిలను ఇలాగే వలలో వేసుకున్నాడు. నలుగురు అమ్మాయిలతో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే నాలుగు దిక్కుల్లో ఉన్న గ్రహాలు ఒక్కటైపోయినట్లు అతని వలలో పడిన అమ్మాయిలు అనుకోకుండా అందరూ కలిసిపోయారు. ఇంతకాలం ఒక అమ్మాయికి తెలీకుండా మరో అమ్మాయితో తిరుగుతూ నలుగురితో ఎంజాయ్ చేసి పోటుగాడి మ్యాటర్ ఆ నలుగురు అమ్మాయిలకు తెలిసిపోయింది. నలుగురు అమ్మాయిలు మాట్లాడుకుని ఒకే కారులో ప్రియుడి ఇంటి ముందు దిగారు. తాను ప్రేమిస్తున్న నలుగురు అమ్మాయిలు ఒకేసారి కలిసి ఇంటికి రావడంతో ఎర్రగులాబీల ప్రేమికుడి మైండ్ బ్లాక్ అయ్యింది.
తరువాత ప్రియుడికి ఏం చెయ్యాలో తెలీక అతను చేసిన పనికి ప్రాణాలు మీదకు వచ్చింది.

బిల్డప్ ఇస్తున్న యువకుడు
పశ్చిమ బెంగాల్ లో సుబామోయ్ కర్ అలియాస్ సుబాయ్ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. రోజు బైక్ లో పెట్రోల్ పట్టుకుంటున్న సుబామోయ్ ఊరిమీద పడుతున్నాడు. అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు ?, మన వలలో పడుతారా అంటూ సుబామోయ్ తిరగడం మొదలు పెట్టాడు. కనపడిన ప్రతి అమ్మాయి వెంట తిరిగిన సుబామోయ్ వారిని వలలో వేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

మొదటి అమ్మాయిని పడేయడానికి కష్టపడ్డాడు
కల్ కత్తాలోని ఓ అందమైన అమ్మాయి సుబామోయ్ కంట్లో పడింది. తరువాత సుబామోయ్ ఆ అమ్మాయి వెంటపడటం మొదలు పెట్టాడు. మొదటిసారి అమ్మాయిని వలలో వేసుకోవడానికి సుబామోయ్ నానా ఇబ్బందులు పడ్డాడు. ప్రతిరోజూ బైక్ లో ఆమెను ఫాలో అయ్యాడు. రోజుకు ఒక డ్రెస్ మార్చాడు. నిన్ను ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి వెంట తిరిగిన సుబామోయ్ చివరికి ఆమెను లొంగదీసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు.

ప్రేమ పెళ్లి పేరుతో వల
మొదటి అమ్మాయి వలలో పడిన తరువాత ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సుబామోయ్ తరువాత కోల్ కత్తాలోనే ఇంకో ఏరియాలో మరో యువతి వెంటపడ్డాడు. నువ్వు అంటే నాకు ఇష్టం అని, మనం పెళ్లి చేసుకుందామని సుబామోయ్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. రెండో అమ్మాయి వలలో పడిపోయిన తరువాత సుబామోయ్ ఒకరి తెలీకుండా ఒకరితో ఎంజాయ్ చేశాడు.

నాలుగు దిక్కుల్లో నలుగురు
ఇద్దరు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సుబామోయ్ మరో అమ్మాయికి వల వేశాడు. సుబామోయ్ సుడితిరగడంతో ఆమె కూడా సుబామోయ్ వలలో పడిపోయింది. ముగ్గురు అమ్మాయిలు వలలో పడటంతో హీరోలాగా ఫీలైపోయిన సుబామోయ్ మరో అమ్మాయికి లైన్ వేశాడు. ఆ అమ్మాయి కూడా ఇతని వలలో పడిపోయింది. నాలుగు దిక్కుల్లో నలుగురు అమ్మాయిలతో ఇంతకాలం సుబామోయ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.

ఇద్దరు అమ్మాయిలు కలిస్తే నలుగురి మ్యాటర్ లీక్ అయ్యింది
సుబామోయ్ కి పరిస్థితులు అనుకూలించలేదు. సుబామోయ్ వలలో పడిపోయిన ఇద్దరు అమ్మాయిలు అనుకోకుండా కలిశారు. మన ఇద్దరిని సుబామోయ్ మోసం చేస్తున్నాడని ఇద్దరూ మాట్లాడుకున్నారు. సుబామోయ్ గురించి ఇ ఇద్దరు అమ్మాయిలు ఆరా తీస్తున్న సమయంలో అతు మరో ఇద్దరు యువతులతో తిరుగుతున్నాడని తెలుసుకుని షాక్ అయ్యారు.

ఒకేసారి నలుగురు కారులో దిగితే బిత్తరపోయిన బాయ్ ఫ్రెండ్
నాలుగు దిక్కుల్లో ఉన్న గ్రహాలు ఒక్కటైపోయినట్లు సుబామోయ్ వలలో పడిన అమ్మాయిలు అనుకోకుండా అందరూ కలిసిపోయారు. ఇంతకాలం ఒక అమ్మాయికి తెలీకుండా మరో అమ్మాయితో తిరుగుతూ నలుగురితో ఎంజాయ్ చేసి పోటుగాడు సుబామోయ్ మ్యాటర్ ఆ నలుగురు అమ్మాయిలకు తెలిసిపోయింది. నలుగురు అమ్మాయిలు మాట్లాడుకుని ఒకే కారులో ప్రియుడు సుబామోయ్ ఇంటి ముందు దిగారు.

కేసు పెడుతామని బెదిరించిన అమ్మాయిలు
ఒకేసారి తాను ప్రేమిస్తున్న నలుగురు అమ్మాయిలు కలిసి నేరుగా ఇంటి దగ్గరకే రావడంతో సుబామోయ్ బిత్తరపోయాడు. నలుగురు అమ్మాయిలు కలిసి ఎందుకు మమ్మల్ని పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేస్తున్నావని ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్ను ఇలాగే వదిలేస్తే మాలాంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావని, నిన్ను పోలీసులకు పట్టిస్తామని ఇద్దరు అమ్మాయి రెచ్చిపోయారు.
Recommended Video

విషం తాగేసిన రసికుడు
పోలీసులు పట్టుకుంటే నాకు సినిమా కనపడుతుందనే భయంతో ఇంట్లోని రూమ్ లోకి వెళ్లిన సుబామోయ్ విషం తాగేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. విషయం గుర్తించిన బంధువులు సుబామోయ్ ను ఆసుపత్రికి తరలించారు. సుబామోయ్ కోలుకుంటున్నాడని, అతని మీద ఇద్దరు అమ్మాయిలు కేసు పెట్టారని, విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు












Click it and Unblock the Notifications