Girls: కాలేజ్ లో అమ్మాయిల బాత్ రూమ్ ల్లో సీక్రేట్ కెమెరాలు, 1,200 వీడియోలు తీసి ?, ఇంకో ఫోన్ లో !
బెంగళూరు: ఫేమస్ ప్రైవేట్ కాలేజ్ లో అమ్మాయిల బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు అక్కడ ఓ అబ్బాయిని చూసి గట్టిగా కేకలు వేశారు. దెబ్బకు ఆ యువకుడు పరారైనాడు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు అదే కాలేజ్ అబ్బాయిని అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ పరిశీలించారు. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు బాత్ రూమ్ లో అర్డనగ్నంగా ఉన్న సమయంలో తీసిన 1,200కు పైగా వీడియోలు, ఫోటోలు ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. కాలేజ్ అబ్బాయి దగ్గర ఇంకో స్మార్ట్ ఫొన్ ఉండటతో వాటిలో ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి ? అని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక సంవత్సరం తరువాత లాయర్ కావలసిన యువకుడు జైలుపాలైనాడు.

బెంగళూరులో ఫేమస్ ప్రైవేట్ కాలేజ్
బెంగళూరు సిటీలోని గిరినగర సమీపంలోని హోసకరహళ్లిలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో వందల మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ప్రతిరోజు అందరూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. ఇదే కాలేజ్ లో శఉభం ఎం. ఆజాద్ అలియాస్ ఆజాద్ అనే యువకుడు బీబీఎ ఎల్ఎల్ బీ ఐదవ సంవత్సరం చదువుతున్నాడు.

కాలేజ్ అమ్మాయిల బాత్ రూమ్ లో సీక్రేట్ కెమెరా
కాలేజ్ లో అమ్మాయిల బాత్ రూమ్ లోకి వెళ్లిన ఆజాద్ అక్కడ సీక్రేట్ కెమెరా ఫిట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. సీక్రేట్ కెమెరా ఫిట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటికే బాత్ రూమ్ లో ఉన్న అమ్మాయిలు బయటకు వచ్చారు. లేడీస్ బాత్ రూమ్ లో అబ్బాయి కనపడటంతో ఆ అమ్మాయిలు గట్టిగా కేకలు వేశారు.

కాలేజ్ సీసీటీవీ కెమెరాల్లో ?
కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు చెయ్యడంతో గిరినగర పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కాలేజ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు అదే కాలేజ్ లో బీబీఎ ఎల్ఎల్ బీ చదువుతున్న ఆజాద్ ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఆజాద్ మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, కాలేజ్ యాజమాన్యం షాక్ అయ్యారు.

1,200 అర్డనగ్న వీడియోలు, ఫోటోలు
ఆజాద్ మొబైల్ ఫోన్ లో కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిల అర్డనగ్న ఫోటోలు, వీడియోలు 1,200 పైగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. చాలాకాలం నుంచి కాలేజ్ లోని లేడీస్ బాత్ రూమ్ లో సీక్రేట్ కెమెరాలు పెట్టిన ఆజాద్ అమ్మాయిల అర్డనగ్న వీడియోలు చిత్రీకరించి అతని మొబైల్ లో స్టోర్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఇంకో మొబైల్ ఫోన్ లో ?.... గతంలో క్షమాపణ పత్రం
కాలేజ్ అబ్బాయి ఆజాద్ దగ్గర ఇంకో స్మార్ట్ ఫొన్ ఉండటతో వాటిలో ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి అని పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఆజాద్ చేశాడని, ఆ సమయంలో ఇంకోసారి ఇలా చెయ్యనని కాలేజ్ యాజమాన్యంకు క్షమాపణపత్రం రాసి ఇచ్చాడని. అయితే మళ్లీ అతని కామాంతో అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని గిరినగర పోలీసులు అన్నారు. ఒక సంవత్సరం తరువాత లాయర్ కావలసిన ఆజాద్ ఇప్పుడు జైలుపాలైనాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications