ఫ్రెండ్‌పై రేప్: వీడియో తీసి నెట్‌లో పెట్టిన యువతులు
బరేలీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో దిగ్ర్భాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తమ స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడుతుండగా ఇద్దరు యువతులు వీడియో తీశారు. అంతేగాక, ఆ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు, ఆ యువతులను అరెస్ట్ చేశారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 16ఏళ్ల బాధితురాలు తన ఇద్దరు స్నేహితురాళ్లను పిలిచింది. అయితే, వారు ఓ యువకుడిని వెంటబెట్టుకుని వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఆ యువతిని ఓ గదిలో బంధించారు. అనంతరం స్నేహితురాళ్లతో వచ్చిన యువకుడు తుపాకీతో బెదిరింపులకు గురి చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా, ఈ ఘటనను బాధితురాలి ఇద్దరు స్నేహితురాళ్లు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి అనంతరం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. డిసెంబర్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు.. దగ్గరి స్నేహితులని ఇంటిక రమ్మంటే వారు ఇంత ఘోరానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి వాపోయాడు.
ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అమన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితులైన బాధితురాలి ఇద్దరు స్నేహితురాళ్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. ఘటన అనంతరం బాధితురాలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి తన తల్లిదండ్రులకు కూడా ఏమీ చెప్పలేకపోయిందని తెలిపారు.
నిందితులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోతోనే ఈ నేరం బహిర్గతమైందని పోలీసులు చెప్పారు. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుడు అమన్ కోసం గాలింపు చేపట్టామని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications