మంచిది కాదు, అమ్మాయిలకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దు: బిజెపి ఎమ్మెల్యే

జైపూర్: మరో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ కూతుళ్లకు తండ్రులు ఎవరూ కూడా సెల్ ఫోన్లు ఇవ్వొద్దని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే సుందర్ లాల్ చెప్పారు.

‘మొబైల్ ఫోన్లు యువతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విలువలు, వారి ప్రవర్తనపై మొబైల్ ఫోన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నయి' అని పిలానీ నియోజకవర్గం నుంచి ఎస్సీ కోటా కింద గెలిచిన సుందర్ లాల్ తెలిపారు.

Girls should not be given mobile phones, says BJP MLA Sunder Lal

అమ్మాయిల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సెల్ ఫోన్లను తమ కూతుళ్లకు ఇవ్వొద్దని ఆ ఎమ్మెల్యే తండ్రులకు సూచించారు. ఝుంజున్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సుందర్ లాల్‌పై వ్యఖ్యలు చేశారు.

కాగా, ఇప్పటికే పలువురు బిజెపి ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సుందర్ లాల్ వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. ఓ వైపు బిజెపి అధినాయకత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ పార్టీ కిందిస్థాయి నేతలు పెడచెవిన పెట్టడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+