నాకు భద్రతివ్వండి! లేదా చంపనివ్వండి: ఎస్పీతో యువతి
గ్వాలియర్: తనను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని, అది సాధ్యం కాకపోతే అతడిని చంపడానికైనా అనుమతివ్వాలని ఓ యువతి జిల్లా ఎస్పీని కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గుడ్డు వాజ్‌పేయ్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. ఇంతకు ముందు అతనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని దీంతో అతను ఇంకా రెచ్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేగాక, ఫోన్లలో, ఫేస్‌బుక్‌లో అసభ్యకర చిత్రాలు పంపుతున్నాడని ఆ యువతి వాపోయింది. దీంతో స్థానికంగా పోలీసు సమావేశం జరుగుతుండగా యువతి అక్కడికి వచ్చి ‘నాకు భద్రతైనా కల్పించండి లేదా చంపడానికైనా అనుమతివ్వండి' అంటూ ఎస్పీని కోరింది.
ఇప్పుడైనా అతనిపై చర్యలు తీసుకోకపోతే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఈ విషయంలో వెంటనే చర్య తీసుకుని ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications