జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇవ్వండి, అపోలోకు విచారణ కమిషన్ ఆదేశాలు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. జయలలిత చికిత్స అందించిన సీసీకెమెరాల క్లిప్పింగ్స్ ఇవ్వాలని అపోలోకు సూచించారు.
ఆనారోగ్యంతో ముఖ్యమంత్రి హోదాలో 2016 సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ చికిత్స విఫలమై మరణించారు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ కీలకం!
జయలలిత చికిత్స అందించిన సమయంలో ఆసుపత్రిలో రికార్డు అయిన సీసీకెమెరాల క్లిప్పింగ్స్ మొత్తం ఇవ్వాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణలో సీసీకెమెరాల క్లిప్పింగ్స్ కీలకంకానున్నాయి.

సిబ్బందికి సమన్లు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇప్పటికే అపోలో ఆసుపత్రి వర్గాలను విచారణ చేసి వివరాలు సేకరించారు. అపోలో ఆసుపత్రిలోని మరికొంత మంది సిబ్బందికి విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

చట్టపరంగా చర్యలు
విచారణ కమిషన్ ముందు ఇంత వరకూ అపోలో ఆసుపత్రి సిబ్బంది హాజరుకాకపోవడంతో జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరుకాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ హెచ్చరించింది.

అమ్మ మృతిపై అనుమానం ?
జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వంతో సహ అనేక మంది అన్నాడీఎంకే పార్టీ నాయకులు డిమాండ్ చెయ్యడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు.

చాల మంది ఉన్నారు
జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పటికే అనేక మందిని విచారణ చేసి వివరాలు సేకరించింది. ఇంకా అనేక చాల మందిని విచారణ చెయ్యాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించి పలువురికి సమన్లు జారీ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications