పోలీసులే దొంగలైన వేళ...చలివేంద్రంలో గ్లాసుల మాయం
దొంగతనాలు జరగకుండా ప్రజల ఆస్థులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులులే చిల్లర పనులకు పాల్పడ్డారు. ఎండాకాలంలో ప్రజలకు మంచినీళ్లందించే చలివేంద్రంలోనే గ్లాసులను ఎత్తుకెళ్లారు తమిళనాడు రాష్ట్ర్రంలోని పుదుక్కోటి జిల్లా పోలీసులు. అయితే చలివేంద్రంలో తరచుగా మాయం అవుతుండడంతో ప్రజలకు ఎండాకాలం చల్లటి నీళ్లు అందించాలని చలివేంద్రం పెట్టిన దాత చివరికి చేసేదిలేక సీసీ కేమేరాలను అమర్చాడు.

అయితే రొటిన్‌గా గ్లాసులే కాదా అనుకన్నారో ఎమో కావాలనే వచ్చారా లేక విధుల్లో భాగంగా వచ్చారో తెలియదు కాని టూవీలర్ పై వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్‌లలో ఒకరు బైక్ పై వేచి ఉండగా మరోకరు నేరుగా చలివేంద్రంలోకి వెళ్లి గ్లాసును తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కేమేరాలో రికార్డ్ అయ్యాయి . ఏకంగా పోలీసులే చీఫ్ గా గ్లాసుల ఎత్తుకెళ్లిపోవడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications