FabiSpray: భారత్‌లో అందుబాటులోకి మరో కరోనా ఔషధం: ముక్కులోనే వైరస్ అంతం
ముంబై: కరోనా వైరస్ బాధితులకు అందించే చికిత్సలో భాగంగా భారతదేశంలో తొలి నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ 'ఫ్యాబిస్ప్రే'(FabiSpray) పేరుతో దీన్ని విడుదల చేసింది. కరోనాతో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రేను అందించవచ్చని వెల్లడించింది. కెనడాకు చెందిన సనోటైజ్ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజ్ స్ప్రేను భారత్‌లో తయారీ, మార్కెట్ చేసుకునేందుకు గ్లెన్ మార్క్ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతచ్చింది.

ఊపిరితిత్తులకు చేరకుండానే వైరస్ అంతం
ఈ ఫార్మా కంపెనీ భారత్‌లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించింది. 24 గంటల్లో 94శాతం వైరల్ తగ్గించగా.. 48 గంటల్లో 99శాతం వైరల్ లోడ్‌ను తగ్గించిందని కంపెనీ వెల్లడించింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే చాలా సురక్షితమైందని, కరోనాను దీటుగా ఎదుర్కోగలదని తెలిపింది. ఫ్యాబిస్ప్రే ఎగువ శ్వాస నాళాల్లోనే కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు రూపొందించినట్టు వెల్లడించింది. ముక్కు ద్వారా అందించే ఈ వ్యాక్సిన్‌ను స్ప్రే చేసినప్పుడు వైరస్‌ను ఊపిరితిత్తుల వరకు చేరకుండా నిరోధిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫ్యాబిస్ప్రే.. ఎగువ శ్వాసనాళాలలోనే కరోనా వైరస్‌ను చంపేస్తుంది
ఫ్యాబిస్ప్రే నాజల్ స్ప్రే కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని, అలాగే ఈ స్ప్రే కూడా చాలా సురక్షితమైందని గ్లెన్‌మార్క్ ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబర్ట్ క్రోకార్ట్ వెల్లడించారు. నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే (ఫ్యాబిస్ప్రే) అనుమతి పొందడంతో పాటు సానోటైజ్ కంపెనీ భాగస్వామ్యంతో టీకా రూపొందించడం ఆనందంగా ఉందని రాబర్ట్ క్రోకార్డ్ తెలిపారు. కరోనాపై భారత పోరాటంలో తాము కూడా భాగస్వామిగా ఉన్నామని చెప్పారు. ఫ్యాబిస్ప్రే.. ప్రత్యేకించి ఎగువ శ్వాసనాళాలలో కరోనా వైరస్‌ను చంపడానికి రూపొందించారు. నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు నాన్స్ ఫిజికల్, కెమికల్ అవరోధంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు వైరస్ వ్యాపించకుండా ఈ స్ప్రే ఔషధం నిరోధిస్తుందని తెలిపారు.
Recommended Video

ఫ్యాబి నాజల్ స్ప్రేతో ఏ కరోనా వేరియంట్ ఐనా 2 నిమిషాల్లోనే ఖతం
ఫ్యాబి నాజల్ స్ప్రే సమర్థవంతమైన సురక్షితమైన యాంటీవైరల్ చికిత్సగా కంపెనీ స్పష్టం చేసింది. ఉటా స్టేట్ యూనివర్శిటీ అమెరికాలో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. నాన్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్‌లతో సహా సార్స్-కోవ్-2 వైరస్‌ను 99.9 శాతం 2 నిమిషాల్లో చంపేస్తుందని రుజువైంది. నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ తెలిపారు. కాగా, ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం.. ఈ నాజల్ స్ప్రే తుది దశ ప్రయోగాలను భారతదేశంలోనూ చేపట్టారు. దేశ వ్యాప్తంగా 20 చోట్ల 306 మంది కోవిడ్ బాధితులపై నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు. వీటిలోనూ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సురక్షితమని తేలడంతో చికిత్సలో వినియోగించుకునేందుకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ ఔషధం మార్కెట్లోకి విడుదలైంది.












Click it and Unblock the Notifications