గోవాలో హంగ్?: గేమ్ బిగిన్స్: ఢిల్లీలో సీఎం: మోడీతో: ఆ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ లోటస్ ఎర
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అంటూ దేశ ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకో రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం గురువారం బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ వాటిని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

యూపీలో యోగి..
అసలు సినిమా విడుదలకు ముందు ట్రైలర్ రిలీజ్ అయినట్టు- సోమవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వల్ల.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం మీద ఓ అంచనా అనేది ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ రాజ్యమే ఏర్పడుతుందంటూ అన్ని సర్వేలు కూడా స్పష్టం చేశాయి. 2017 తరహాలోనే భారీ మెజారిటీని అందుకుంటాయని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ తేల్చాయి.

గోవాలో హంగ్..
మణిపూర్‌లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. ఈ మూడూ పోగా ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు- గోవా, ఉత్తరాఖండ్‌పై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ రెండు చోట్ల కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రత్యేకించి గోవాలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తేల్చి చెప్పాయి. తన మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ మరుసటి రోజే..
ఈ పరిణామాల మధ్య గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. దేశ రాజధానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజే ఆయన ఢిల్లీలో అడుగు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆయన కలుసుకోనున్నారు. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే- గోవాలో ఎలాంటి వ్యూహాలను పన్నాల్సి ఉంటుందనే విషయం ఆయనకు హితబోధ చేయనున్నారు పార్టీ అగ్ర నాయకులందరూ కలిసి.

ఆపరేషన్ లోటస్..
ఆపరేషన్ లోటస్.. బీజేపీ చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం. అరకొర సీట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయోగించే లెథల్ వెపన్ ఇది. ఇది ఎంత శక్తిమంతమైనదనే విషయం ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లల్లో చూశాం. కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా పడదోసింది బీజేపీ. ఏకంగా 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. తమ పార్టీలో చేర్చుకోగలిగింది. ఫలితంగా- అధికారంలోకి వచ్చిన 114 నెలల్లోనే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కర్ణాటక, మధ్యప్రదేశ్..
ఆయన స్థానంలో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తరహా పరిస్థితులు మధ్యప్రదేశ్‌లోనూ నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం- ఆపరేషన్ లోటస్ పాలిట పడింది. కుప్పకూలింది. అర్ధాంతరంగా కమల్‌నాథ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

గోవాలో అవే పరిస్థితులు..
ఇప్పుడు అలాంటి రాజకీయ పరిస్థితులే గోవాలో ఉత్పన్నం అయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. హంగ్ అసెంబ్లీ లేదా- అరకొర మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై బీజేపీ అగ్ర నాయకత్వం అప్పుడే ఫోకస్ పెట్టింది కూడా. ఇందులో భాగంగానే- ప్రమోద్ సావంత్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, కాంగ్రెస్‌ను ఎలా నిలువరించాల్సి ఉంటుందనే విషయంపై ఆయన చర్చించనున్నారు.
Recommended Video

సింగిల్ లార్జెస్ట్‌గా
40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి 21 సీట్లు అవసరం అవుతాయి. బీజేపీ, కాంగ్రెస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియాటుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం- కాంగ్రెస్ 15 నుంచి 20, బీజేపీ-14 నుంచి 18 స్థానాలు దక్కుతాయని తేల్చి చెప్పాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 2 నుంచి 5, ఇతరులు నాలుగు స్థానాలు వరకు సాధిస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తుంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications