గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..
ఇండియాలో ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త తగ్గిందనుకోండి. మందు, విందు, పొందుకు స్వర్గంగా ఉండే గోవాలో డ్రగ్స్ మహమ్మారి ప్రభావం కూడా ఎక్కువే. సర్కారు ఎంత కట్టడి చేసినా మాదకద్రవ్యాల్ని అరికట్టడం సవాలుగా మారింది. ఇదిలా ఉంటే..
గోవా రాష్ట్రాన్ని పాలిస్తోన్న బీజేపీ సర్కారు.. స్థానికంగా గంజాయి సాగుచేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది మాదకద్రవ్యంగా మాత్రం వాడరాదని కఠిన షరతులు విధించింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు గోవా న్యాయశాఖ బుధవారం అనుమతులిచ్చింది.

న్యాయబద్ధమైన అంశాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్లు న్యాయ శాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ మీడియాకు తెలిపారు. దీంతో గోవాలో గంజాయి సాగుకు చట్టబద్ధత లభించినట్లయింది. 1985లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్(NDPS)కింద గంజాయి మొక్క నిషేధిత జాబితాలో చేరిందని, సవరణ ఉత్తర్వులతో ఇప్పుడు వాటి సాగుకు అనుమతిచ్చామని, దీంతో ఫార్మాకంపెనీలకు ఈ సాధారణ డ్రగ్ గా గంజాయిని అమ్మే వీలు ఏర్పడిందని మంత్రి చెప్పారు. కాగా,
గంజాయి సాగు విషయంలో గోవా ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ చర్యతో బీజేపీ ఇంకాస్త పతనం అయిందని, సర్కారు చర్యలు చట్టవిరుద్దంగా ఉన్నాయని, డ్రగ్స్ వాడకంపై గోవా ఫైట్ చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..రాష్ట్ర సామాజిక వ్యవస్థలోకి డ్రగ్ మరింతగా వచ్చేందుకు దోహదపడుతుందని గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమర్నాథ్ పంజికర్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పంజికర్ డిమాండ్ చేశారు. గోవా కంటే ముందు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వాలు కూడా గంజాయి సాగుకు అనుమతిచ్చే దిశగా చర్యలు చేపట్టాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications