లైంగిక వేధింపులు: తరుణ్ తేజ్‌పాల్‌పై ఎఫ్ఐఆర్

కాగా శుక్రవారం విచారణ చేపట్టిన పోలీసులు తేజ్‌పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓపి మిశ్రా మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్‌పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. క్రైం బ్రాంచుకు చెందిన ఒక బృందాన్ని తదుపరి విచారణ కోసం ఢిల్లీకి పంపాలని రాష్ట్ర డిజిపి కిషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు మిశ్రా తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్‌పాల్‌పై అత్యాచారం కేసు నమోదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. పది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్టులో ఉన్న సమయంలో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ హోటల్ నుంచి సిసి కెమెరా ఫుటేజీని సేకరించామని, ఫుటేజీని పరిశీలించిన తర్వాత సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. బాధితురాలికి సంబంధించిన ఈ మెయిల్ వివరాలను, తేజ్‌పాల్ వాదనను తమకు సమర్పించాల్సింది తెహల్కా మేనేజ్‌మెంట్‌కు సందేశం పంపించినట్లు ఆయన తెలిపారు.
కాగా దీనిపై సరైన చర్య తీసుకోవడానికి, సరిగ్గా స్పందించడానికి తగిన సమయం కావాలని తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌధురి తెలిపారు. అయితే ఘటనపై తేజ్‌పాల్ భిన్నంగా స్పందించారని, బాధితురాలికి క్షమాపణలు చెప్పాలని అతన్ని డిమాండ్ చేసినట్లు ఆమె చెప్పారు. బాధితురాలికి క్షమాపణలు చెప్పిన తేజ్‌పాల్ ప్రస్తుతం ఎడిటర్ ఇన్ ఛీప్ పదవి నుంచి కూడా వైదొలిగారని ఆమె తెలిపారు. తాను తీసుకున్న చర్యల పట్ల బాధితురాలు సంతృప్తిగా ఉందని చౌధురి తెలిపారు.
విచారణకు సహకరిస్తా: తరుణ్ తేజ్‌పాల్
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ విచారణలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. సంఘటనకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తానని ఆయన చెప్పారు. తాను ఇప్పటికే బాధితురాలిని క్షమాపణలు కోరానని తెలిపారు. ఆరు నెలలపాటు తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నట్లు తేజ్‌పాల్ చెప్పారు. గోవా పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొంత సేపటికే తేజ్‌పాల్ పైవిధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications