గోవా ఎన్నికలు: తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, మార్గోవా నుంచి మాజీ సీఎం కామత్ పోటీ
న్యూఢిల్లీ/పనాజి: వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది.
ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితా ప్రకారం మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ మార్గోవా నుంచి పోటీ చేయనున్నారు.

రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులు:
సుధీర్ కనోల్కర్ - మపుసా
టోనీ రోడ్రిగ్స్ - తలీగో
రాజేష్ వెరెంకర్ - పోండా
సంకల్ప్ అమోంకర్ - మార్ముగో
అలీక్సో రెజినాల్డో లౌరెన్కో - కర్టోరిమ్
దిగంబర్ వసంత్ కామత్ - మార్గోవా
యూరి అలెమావో - కుంకోలిమ్
ఆల్టోన్ డి'కోస్టా - క్యూపెమ్
గత నెలలో, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ నామినేట్ చేయబడే వారిలో ఎక్కువ మంది యువకులు, కొత్తవారు ఉంటారని చెప్పారు. పార్టీ ఫిరాయించి ఇతర పార్టీల్లో చేరిన ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఏఐసీసీ గోవాకు స్క్రీనింగ్ కమిటీని ప్రకటించిన క్రమంలో గోవా ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కనీసం 70 నుంచి 80 శాతం మంది యువకులు, కొత్తవారు ఉంటారు అని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవాలో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులను నిర్ణయించే సమయంలో పార్టీ బ్లాక్ కమిటీలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చోడంకర్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల గోవా పర్యటనలో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. కోస్తా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాలలో కోటాకు 30 చొప్పున హామీ ఇచ్చారు.
అధికార బిజెపి సిద్ధాంతం "మహిళలకు వ్యతిరేకం" అని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రాథమిక నిధులతో పాటు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష వరకు గ్రాంట్‌ను అందజేస్తుందన్నారు. తద్వారా వారి వ్యాపారం అభివృద్ధి చెందడానికి, వారి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి సహాయపడుతుందని ప్రియాంక హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 శాతం ఉద్యోగాల్లో మహిళలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామని ఆమె ప్రకటించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications