Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోవాపై దుష్ప్రచారం?

Goa Tourism: గోవాను.. పర్యాటకుల బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తుంటారు. వీకెండ్, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్, ఫ్యామిలీ, బ్యాచిలర్ పార్టీ ఇక్కడ సర్వ సాధారణం. అకేషన్ ఏదైనా కూడా వెకేషన్‌కు మాత్రం గోవాను సెలెక్ట్ చేసుకుంటుంటారు చాలామంది పర్యాటకులు. మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే ఇక్కడికి వచ్చే విదేశీయుల తాకిడి కూడా ఎక్కువే.

అలాంటి గోవా పర్యాటకం పట్ల ఈ మధ్యకాలంలో వ్యతిరేక కథనాలు వెలువడుతున్నాయి. తప్పుదారి పట్టించేలా, వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా సోషల్ మీడియా ఆధారంగా ప్రచారం సాగుతోంది. పండుగ సీజన్‌లో గోవాకు వెళ్లే వారి రద్దీ తగ్గిందని, దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయంటూ పోస్టులు పడుతున్నాయి.

Goa remains one of the most sought-after destinations with tourism thriving like never before

నిజానికి- గోవా పర్యాటకం ఇదివరకెప్పుడూ లేనంతగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకుల రాకలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హోటళ్లు దాదాపు పూర్తి ఆక్యుపెన్సీని అందుకున్నాయి. బీచ్‌లన్నీ కూడా సందర్శకులతో నిండిపోతున్నాయి.. ఎప్పట్లాగే. నైట్ లైఫ్ యధాతథంగా కొనసాగుతోంది.

సాంస్కృతిక ఉత్సవాలు, అక్కడి సముద్ర తీర ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తూనే వస్తోన్నాయి. నార్త్ గోవాలోని కేరిమ్, సౌత్‌లో ఉన్న కెనకోనా, అంజునా, కలంగుటే వంటి ప్రఖ్యాత బీచ్‌లకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతూనే ఉన్నారు. ఫలితంగా తన ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని గోవా మరోసారి నిరూపించుకుంది.

గోవాకు పర్యాటకుల తాకిడి తగ్గిందంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా చైనా ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ విడుదల చేసిన ఓ సర్వే ఈ అనుమానాలను రేకెత్తించింది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఇష్టానుసారంగా, వ్యూస్ కోసం పరస్పర విరుద్ధమైన వార్తా కథనాలను ప్రసారం చేశారని తేలింది.

ఒకవంక- వాళ్లు అధిక విమాన ఛార్జీలు, హోటల్ ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతూనే మరోవంక గోవా బీచ్‌లు, వీధులు ఖాళీగా ఉన్నాయనడం ఈ పరస్పర విరుద్ధ కథనాలకు అద్దం పట్టనట్టయింది. ఎలాంటి డేటా కూడా లేకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి అవాస్తవ కథనాలను ప్రసారం చేస్తోన్నాయని తేలింది.

2024 డిసెంబర్‌లో గోవా అదనంగా 75.51 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది. ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో ముగిసిన మూడు త్రైమాసికాల్లో మొత్తం ఆదాయం 4614.77 కోట్ల రూపాయల ఆదాయం పర్యాటకరంగం ద్వారానే సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చుకుంటే 365.43 కోట్ల రూపాయలు అధికం.

ఇందులో జీఎస్టీ ద్వారా వచ్చిన రాబడిలో 9.62 శాతంగా తేలింది. వ్యాట్ వసూళ్లలో కూడా 6.41 శాతం పెరుగుదల నమోదైంది. ఈ రెండూ కూడా గోవా పర్యాటకం రంగం ఎంతగా బలపడిందో, దాని ద్వారా ఆ రాష్ట్రం బలమైన ఆర్థిక కార్యకలాపాలను ఎలా అందుకుందో స్పష్టం చేసినట్టయింది.

ఇక్కడి బీచ్‌లు, హెరిటేజ్ సైట్‌లను సందర్శించడానికి రోజూ లక్షలాదిమంది పర్యాటకులు గోవాకు వస్తుంటారనేది జగద్విదితమే. అంతర్జాతీయ సందర్శకులకూ గోవా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి పర్యావరణం, విలక్షణమైన సాంస్కృతిక సంపద పట్ల వాళ్లు ఆకర్షితులవుతుంటారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ నుండి వెల్‌నెస్ రిట్రీట్‌ల వరకు గోవా అందించే అద్భుత ఆఫర్‌ల కోసం డొమెస్టిక్ టూరిజాన్ని ఆకర్షిస్తోంది గోవా. గ్లోబల్ టూరిజం హాట్‌స్పాట్‌గా మారింది.

ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న తప్పుడు కథనాల వల్ల గోవా పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. అధికారకంగా ఎవరూ ధృవీకరించని కథనాల వల్ల గోవా ప్రతిష్టను దెబ్బతీస్తాయని, పర్యాటకులలో అనవసరమైన సందేహాలను సృష్టిస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

గోవాలో పర్యాటకం క్షీణిస్తోందనేది ఒక అపోహ తప్ప మరొకటి కాదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి. గోవా బీచ్‌లు, ఇతర పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో నిండిపోతోండటం, రికార్డుస్థాయి ఆదాయాన్ని ఆర్జించడం వంటి పరిణామాలు దీన్ని రుజువు చేస్తోన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+