గోవా అంటే బీచ్ లు ఒక్కటే కాదు.. అంతకుమించిన టూరిస్ట్ ప్లేస్ ల వివరాలు ఇవే..

గోవా అనగానే చాలామంది యువత ఎగిరి గంతేస్తారు. గోవా బీచ్ ల్లో ఎంజాయ్ చేయాలని చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తుంటారు. కాస్త విరామం దొరికినా లగేజీ సర్దుకుని గోవాకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే గోవా అనగానే చాలామందికి బీచ్ లు మాత్రమే గుర్తుకొస్తుంటాయి. కానీ వాటితోపాటు ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయని మీకు తెలుసా..? గోవాను పోర్చుగీసు వాళ్లు వందల ఏళ్లు పరిపాలించారు. పోర్చుగీసు, గ్రీకు శైలిలో ఎన్నో కోటలు, కట్టడాలను నిర్మించారు. వాటిలో బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ కట్టడం ఒకటి. ఇది యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. ఇది ఒక చర్చి. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు దీన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ చర్చి భారత్ లో క్రైస్తవ మత వ్యాప్తి కోసం పోర్చుగీసు ప్రభువులు నిర్మించిన మొదటి నిర్మాణంగా భావిస్తుంటారు. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పవిత్ర అవశేషాలు ఉన్నాయని ప్రతీతి.

ఈ చర్చి పోర్చుగీసు వాస్తు కళాశిల్పికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్కడ బంగారంతో చేసిన బలిపీఠం ప్రత్యేకంగా నిలుస్తోంది. అలాగే అగువాడ కోట.. ఈ కోట మండావి నది ఒడ్డున ఉంటుంది. 17వ శతాబ్దంలో ఈ కోటను పోర్చుగీసు వాళ్లు నిర్మించారు. ఆసియాలోనే మొట్టమొదటి లైట్ హౌజ్ ను ఇక్కడే ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక ఈ కోటలో దాదాపు 100 ఫిరంగులు.. 23,00,000 గ్యాలన్ల నీటిని నిల్వచేయగల ఒక భారీ నీటితొట్టె ఉన్నాయి. గోవా సందర్శించడానికి అందమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. అలాగే ఈ కోట నుంచి సన్ సెట్ వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే చపోరా నదిలో చిన్న ప్రయాణం చేయవచ్చు. ఈ నది చుట్టూ ఉన్న చిత్తడి అడవులు, సన్ సెట్ వర్ణాలను చూస్తూ ప్రయాణించడం ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంటుంది. ఇక్కడికి దగ్గర లోనే కేసర్వాల్ జలపాతం కూడా ఉంది. ఈ జలపాతం కింద ఒక చిన్న కొలను ఉంటుంది. ఈ నీటిలో ఈత కొడితే సహజంగా మసాజ్ లా అనిపిస్తుందని చాలా పర్యటకులు భావిస్తుంటారు. అలాగే శరీరానికి ఉల్లాసం కూడా కలుగుతుంది.

ఇక అందరికీ తెలిసిన దూద్ సాగర్ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే.. దూద్ సాగర్ జలపాతం గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. పశ్చిమ కనుమల్లోని పచ్చని అడవుల మధ్య కనిపించే ఎత్తైన కొండపై నుంచి తెల్లని నీరు.. పాలధారలా కిందికి జాలువారుతూ పర్యటకుల్ని కనువిందు చేస్తుంది. అందుకే దీన్ని దూద్ సాగర్ అని పిలుస్తుంటారు. ఇక జలపాతం చుట్టూ ఉండే అడవి వాతావరణం, ప్రకృతి ప్రేమికులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో జీప్ సఫారీ, ట్రెక్కింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. పర్యటకులను మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

Goa tour only beaches in goa no it is not just about beaches here are the must-explore spots there

అలాగే గోవా రాజధాని పనాజీలో ఓ రంగుల ప్రపంచం ఉంది. అదే ఫొంటైన్హాస్ ఇక్కడ అడుగుపెడితే గోవాలోనే మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. పోర్చుగీస్ ప్రభావం కనిపించే పాత ఇళ్లు, రంగు రంగుల గోడలు, చిన్న వీధులు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంటాయి. ఈ రంగు రంగుల ప్రపంచం మధ్యలో నడుచుకుంటూ వీధులను అన్వేషిస్తూ ఫొటోలూ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంకా గోవాలో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. కేవలం బీచ్ లు మాత్రమే కాకుండా ఈ ప్రాంతాలను కూడా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+