ఇలా అయితే గోవాకు ఎవరూ వెళ్లరు భయ్యా..!

బ్యాచిలర్స్ పార్టీ అయినా.. డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా గోవాకే వెళ్తుంటారు చాలామంది. సరదాగా సముద్ర తీరంలో హాయిగా గడిపేందుకు అటు యువత, ఉద్యోగులు, కొత్తగా పెళ్లయిన కపుల్స్ గోవాకే క్యూ కడతారు. కానీ రాను రాను గోవాలో పర్యటకులకు భద్రత కరువైంది. పర్యటకుల భద్రత గోవాలో ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా బైక్ అద్దె వివాదం కారణంగా హైదరాబాద్ కు చెందిన దంపతులపై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ కు చెందిన కొత్తగా పెళ్లయిన ఓ జంటపై గోవాలో తీవ్రమైన దాడి జరిగింది. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కాగా సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లాలని అనుకుంటున్న టూరిస్టులు భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గోవాలో టూరిస్టుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా హైదరాబాదుకు చెందిన ఓ జంట విహార యాత్ర కోసం గోవాకు వెళ్లారు.

అయితే గోవాలోని పనాజీ బస్‌ స్టాండ్ సమీపంలో బైక్ అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం సమయానికి తిరిగి అప్పగించారు. అయితే అద్దెదారులు అదనంగా రూ. 200 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించగా.. అక్కడ ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో కొంతమంది స్థానికులు, బైక్ అద్దెకు ఇచ్చే వ్యక్తులు గుంపుగా వచ్చి జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో భర్త తలకు తీవ్ర గాయాలు కాగా.. గర్భిణి భార్య ముఖం తీవ్రంగా వాచిపోయింది. దీంతో వారిని గోవా మెడికల్ కాలేజ్‌కు తరలించారు.

Goa Tourist Safety Concerns Rise Hyderabad Couple Attacked in Bike Rental Dispute

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో గోవాకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గోవా లాంటి పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+